Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు శుభవార్త: అందుబాటులోకి రెగ్యులర్ రైళ్లు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:48 IST)
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన రెగ్యులర్ సర్వీసులు త్వరలోనే మొదలు కానుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మూడు నెలల పాటు దేశానికి తాళం పడిన సంగతి తెలిసిందే. 
 
దీని కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేసింది రైల్వే శాఖ. రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. అయితే రెగ్యులర్ రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. టికెట్ ధరపై 30 శాతం అధిక ధరతో వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తూ వచ్చింది రైల్వే శాఖ. 
 
కరోనాకు ముందు దేశవ్యాప్తంగా నిత్యం 1700 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, ముప్పై ఐదు వందల ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కరోనా ఆంక్షల కారణంగా ఆ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక రైళ్లలో 95శాతం మెయిల్ రైళ్లు అందుబాటులో ఉండగా 25శాతం రైలు ఇతర కేటగిరీలలో సేవలను అందిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను కేవలం వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి.
 
70శాతం ప్యాసింజర్ రైలు ఎక్స్‌ప్రెస్ హోదా ఇచ్చి అదే స్థాయిలో టికెట్ ధరను కూడా వసూలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆదేశాలు రద్దు చేయడంతో పాటు రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. దీంతో ప్రయాణీకులకు ఊరట కలుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments