Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ కారణంగా భారీగా పెరిగిన క‌రోనా మరణాలు... దేశంలో అదుపులోనే!

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:18 IST)
క‌రోనా మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో, భార‌త‌ దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
 
శుక్రవారం 12,66,589 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 11,850 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.38 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12,403 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
 
 
గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,36,308గా ఉంది. అవి 274 రోజుల కనిష్ఠానికి తగ్గుముఖం పట్టాయి. ఇక రోజూమాదిరిగానే మరణాల సంఖ్యపై కేరళ గణాంకాల ప్రభావం పడింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి..555కి చేరింది. ఇప్పటివరకు 4,63,245 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.  మరోపక్క నిన్న 58.42 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 111 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments