Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రైల్వే బడ్జెట్ కు మంగళం'... సాధారణ బడ్జెట్‌లోనే.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌కు మంగళం పాటపాడింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:13 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌కు మంగళం పాటపాడింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 
 
దీంతో గడచిన 92 సంవత్సరాల నుంచి సాధారణ బడ్జెట్‌కు ముందు పార్లమెంట్ ముందుకు వచ్చే రైల్వే బడ్జెట్ ఇకపై కనిపించదు. ఇటీవలి కాలంలో ఆదాయం తగ్గి, మూలధన వ్యయాలు పెరిగాయన్న కారణాలు చూపుతూ, రైల్వే శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని గత కొద్ది కాలంగా కేంద్రం ప్రతిపాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. 
 
కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1న రైల్వే, కేంద్ర బడ్జెట్‌లను కలిపి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక రెండు బడ్జెట్ల విలీనానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి వుంది. జనవరి 25లోగా ఈ పని పూర్తయితేనే, ఫిబ్రవరి 1న సంయుక్త బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చే వీలుంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments