Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలతో నిర్మాణ రంగంపై పెనుభారం

Webdunia
మంగళవారం, 17 మే 2022 (10:27 IST)
దేశంలోని నిర్మాణ రంగంపై పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలు భారీ భారాన్ని మోపుతున్నాయి. గరిష్టంగా టన్ను ఉక్కు ధర దాదాపు 75 వేల నుంచి 76 వేల వరకు చేరుకుంది.
 
స్టీల్ ఉత్పత్తులు, టీఎంటీ బార్లు.. నిర్మాణాలు మందగించిన కారణంగా 10, 15 శాతం మధ్య తగ్గాయి. ఈ రేట్లు రానున్న కాలంలో మరింతగా తగ్గుతాయని స్టీల్ రోలింగ్ మిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ వివేక్ అదుకియా అన్నారు.
 
ఇన్‌పుట్‌ ఖర్చులు సైతం 50 శాతం పెరగటం, స్పాంజ్ ఐరన్ తయారీకి వినియోగించే అధిక నాణ్యత గల థర్మల్ బొగ్గు టన్నుకు 120 డాలర్ల వరకు పెరగటం అధిక ధరలకు మరో కారణంగా తెలుస్తోంది. 
 
యుద్ధం కారణంగా టన్ను బొగ్గు 300 డాలర్లకు చేరుకుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రానున్న కాలంలో ఉక్కు ధర టన్నుకు 60 వేల వరకు తగ్గుతుందని వారు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ప్రభుత్వాలు నిర్మాణాలను పెంచటం వల్ల ఏర్పడిన డిమాండ్ కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు తగ్గకపోతే.. 30-40 శాతం సెకండరీ స్టీల్ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాలి లేదా మూసివేయవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments