Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నులు తగ్గించనున్న కేంద్రం - దిగిరానున్న వంట నూనెల ధరలు

Oils
, శుక్రవారం, 6 మే 2022 (14:21 IST)
గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా చూపిన వ్యాపారులు ఈ వీటి ధరలను ఆమాంతం పెంచేశారు. దీంతో సమాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాన్ని మోయలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెలపై వసూలు చేసే పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ పులి లాంటోడు.. వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం: శ్రీనివాస్ గౌడ్