Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లలోని తమ తయారీకేంద్రాల వ్యాప్తంగా 7 వేల మందికి పిట్టి ఇంజనీరింగ్ టీకాలు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (16:18 IST)
కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న దేశానికి మద్దతునందించడంతో పాటుగా ప్రజలు మరియు తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించడంలో భాగంగా పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారం రోజులుగా నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లలోని తమ తయారీ కేంద్రాలు, కార్పోరేట్‌ కార్యాలయాల వ్యాప్తంగా 7వేల మందికి టీకాలను అందించింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు మోతాదుల టీకాలను పూర్తి ఉచితంగా ఉద్యోగులకు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం పలు ఆరోగ్య సంరక్షణ  కేంద్రాలతో కంపెనీ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
 
ఈ కార్యక్రమం గురించి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌– వైస్‌ ఛైర్మన్‌ శ్రీ అక్షయ్‌ ఎస్‌ పిట్టి మాట్లాడుతూ ‘‘కార్యాలయాలు, తయారీకేంద్రాలలో ఉద్యోగులకు సురక్షిత వాతావరణం అందించాలనే ప్రభుత్వ మార్గదర్శకాలను మేము అనుసరిస్తున్నాము. మా ఉద్యోగులతో పాటుగా 7వేల మంది ప్రజల టీకా ఖర్చులను భరించడమనేది కోవిడ్-19తో పోరాడుతున్న దేశానికి మా వంతు సహకారంగా  భావిస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారిని జయించేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
 
లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పిట్టి ఇంజినీరింగ్‌ పలు కార్యక్రమాలను చేపట్టింది. అత్యంత కఠినమైన భద్రతా మార్గదర్శకాలను ప్లాంట్‌లు, కార్యాలయాల వద్ద నిర్వహించడంతో పాటుగా పలు ఆన్‌లైన్‌ కార్యక్రమాల ద్వారా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మానసిక సంక్షేమానికి భరోసా అందించేందుకు కృషి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం