Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ప్రజలకు సారీ చెప్పిన పియర్స్ బ్రోస్నాన్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి ప్రకటనదారులు లోకల్ స్టార్స్‌ను ఎంపికచేసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకుంటారు. కానీ భారతదేశానికి చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ మా

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (09:45 IST)
సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి ప్రకటనదారులు లోకల్ స్టార్స్‌ను ఎంపికచేసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకుంటారు. కానీ భారతదేశానికి చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ మాత్రం ఏకంగా తమ బ్రాండ్ ప్రమోషన్‌కు హాలీవుడ్ స్టార్ హీరోనే ఎంపిక చేసింది. అదికూడా జేమ్స్ బాండ్ సీరిస్‌తో క్రేజ్ సంపాదించుకున్న పీర్స్ బ్రోస్నన్‌తో ఇండియన్ పాన్ మసాలాను ప్రమోట్ చేయించారు. 
 
వరుస బాండ్ చిత్రాలతో అలరించిన మాజీ జేమ్స్ బాండ్ పీర్స్ బ్రోస్నన్ చేతిలో ఇండియాలో తయారైన పాన్ మసాలా డబ్బా ఉన్న ఓ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించారు. అయితే పాన్‌మసాలా యాడ్‌లో కనిపించినందుకు హాలీవుడ్ నటుడు పియర్స్ బ్రోస్నాన్ భారత ప్రజలకు శుక్రవారం సారీ చెప్పారు. 
 
జేమ్స్‌బాండ్ పాత్రలతో జనాదరణ పొందిన బ్రోస్నాన్ తాను ప్రమోట్ చేసే ఉత్పాదన క్యాన్సర్ కారకమని తెలియక ఒప్పుకొన్నానని స్పష్టం చేశారు. నోటిని తాజాగా ఉంచుతుంది.. పళ్లను తెల్లగా తళతళలాడేలా చేస్తుంది.. సహజసిద్ధమైన పదార్థాలతో తయారైనది. అందులో పొగాకు, వక్కపొడి లేదా మరే ఇతర ప్రమాదకరమైన పదార్థం లేదు అని చెప్పడం వల్లనే ఆ యాడ్‌కు అంగీకరించానని పీపుల్స్ మ్యాగజైన్‌కు పంపిన ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. 

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments