Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల చేసిన పియాజ్జియో

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (20:26 IST)
ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను నేడు ఆవిష్కరించినట్లు పియాజ్జియో ఇండియా నేడు వెల్లడించింది. అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఈ ప్రీమియం స్కూటర్‌ ఇప్పుడు 1,25,997 రూపాయల ధరలో (ఎక్స్‌షోరూమ్‌, పూనె) లభిస్తుంది. దీనిని తొలుత 5 వేల రూపాయల మొత్తం చెల్లించి భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ డీలర్‌షిప్‌లు లేదా ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ apriliaindia.com వద్ద కూడా బుక్‌ చేసుకోవచ్చు.
 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో ఏప్రిలియా యొక్క తాజా అంతర్జాతీయ డిజైన్‌ భాషను జొప్పించారు. దీనిలో అత్యున్నత పనితీరు కలిగిన సింగిల్‌ సిలెండర్‌, 4స్ట్రోక్‌, ఎయిర్‌కూల్డ్‌, మూడు వాల్వ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ స్వచ్ఛమైన ఉద్గారాల ఇంజిన్‌ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత శక్తి 11 పీఎస్‌ను 7100 ఆర్‌పీఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది. అసాధారణ సవారీ అనుభవాలను, అత్యున్నత స్థాయి సౌకర్యం సైతం అందించడానికి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో అతిపెద్ద, పొడవైన, సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన సీట్లు ఉన్నాయి. ఇవి లెదర్‌ స్యూడ్‌ అనుభూతులను అందించడంతో పాటుగా మహోన్నత పనితనాన్ని సైతం అందిస్తుంది. ఇది శక్తివంతమైన ప్రీమియం అనుభూతులను ఎస్‌ఎక్ప్‌ఆర్‌ 160కు అందిస్తుంది. ఈ స్కూటర్‌ ఏడు లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో వస్తుంది.
 
ఈ సందర్భంగా శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ, ‘‘అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మా ప్రీమియం స్కూటర్‌ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను భారతదేశంలోని మా వివేకవంతులైన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. భారతదేశం కోసం ఇటలీలో డిజైన్‌చేయబడిన ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 మహోన్నత శైలి, అత్యున్నత పనితీరు, అసాధారణ సౌకర్యం ప్రదర్శిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా డీలర్‌షిప్‌లందరి వద్ద లభ్యమవుతున్న ఈ స్కూటర్‌ భారతీయ ప్రీమియం ద్విచక్ర వాహన మార్కెట్‌లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పగలదని మేము నమ్ముతున్నాము మరియు భారతదేశం కోసం పియాజ్జియో యొక్క రాబోవు ప్రణాళికలకు ఇది నిదర్శనంగానూ నిలువనుంది’’ అని అన్నారు.
 
భారీ 210 చదరపు సెంటీమీటర్ల బహుళ పనితీరు కలిగిన పూర్తి డిజిటల్‌ క్లస్టర్‌ డిస్‌ప్లే కలిగిన ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో పలు ఫీచర్లు అయినటువంటి డిజిటల్‌ స్పీడ్‌ఇండికేటర్‌, ఆర్‌పీఎం మీటర్‌, మైలేజీ ఇండికేటర్‌, యావరేజ్‌ స్పీడ్‌ మరియు టాప్‌ స్పీడ్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ ఫ్యూయల్‌ ఇండికేటర్‌, ఇంజిన్‌ మల్టీఫంక్షన్‌ ఇండికేటర్‌ మొదలైనవి ఉన్నాయి. వినియోగదారులు మొబైల్‌ కనెక్టవిటీ యాక్ససరీని సైతం ఎంచుకోవచ్చు. ఇది  యూజర్ల మొబైల్‌ను స్కూటర్‌తో అనుసంధానిస్తుంది మరియు లొకేట్‌ చేసేందుకు సైతం అనుమతిస్తుంది. అవసరమైన సందర్భాలలో సెక్యూరిటీ అలారం సైతం మోగించడంతో పాటుగా ఇంకెన్నో చేస్తుంది.
 
దీనియొక్క వినూత్నమైన, సరిపోల్చలేనటువంటి లుక్స్‌ను మూడు కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినీఫ్‌తో కాంప్లిమెంట్‌ చేశారు. ఏప్రిలియా యొక్క సిగ్నేచర్‌ గ్రాఫిక్స్‌ను ఇది ప్రదర్శించడంతో పాటుగా మాట్‌ బ్లాక్‌ డిజైన్‌ ట్రిమ్స్‌ను ఇది కలిగి ఉంటుంది. దీనితో పాటుగా క్రోమ్‌ ఎలిమెంట్స్‌ సైతం ఉన్నాయి. ఈ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌, ఐ లైన్‌ పొజిషన్‌ లైట్స్‌ ముందు ఉన్న ఇండికేటర్‌ బ్లింకర్స్‌తో మిళితం కావడంతో పాటుగా దీని యొక్క వినూత్నమైన లైట్‌ ప్లేను సృష్టిస్తుంది.
 
డైమండ్‌ రిఫ్లెక్షన్‌ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టైల్‌ లైట్లు, అనుసంధానిత వెనుక బ్లింకర్లతో మిళితమై అదే రీతిలో నూతన తరపు సౌందర్యం అందిస్తాయి. ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 వాహనాలు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో పాటుగా వెంటిలేటెడ్‌ డిస్క్‌ బ్రేక్‌ మరిము ట్విన్‌ పాట్స్‌ కాలిపర్‌ హైడ్రాలిక్‌ బ్రేక్‌నుకలిగి ఉన్నాయి. ఇవి అత్యున్నత బ్రేక్‌ పనితీరును అందిస్తాయి. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 అత్యంత ఆకర్షణీయమైన గ్లోసీ రెడ్‌, మాట్‌ బ్లూ, గ్లోసీ వైట్‌ మరియు మాట్‌ బ్లాక్‌ రంగులలో లభ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments