Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏమాత్రం తగ్గని కేసుల సంఖ్య

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (20:05 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 490 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,718 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,68,769 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 
 
మరో 3,864 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,085 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,716 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,14,15,246 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మరో నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 1522 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments