Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కల్లో పెట్రోల్ ధరలు - కుప్పంలో రూ.110

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:29 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నామొన్నటివరకు కేవలు మెట్రో నగరాల్లోనే సెంచరీలో కొట్టిన చమురు ధరలు ఇపుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ సెంచరీ దాటి.. రికార్డు స్థాయిలో ధరను పలుకుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోల్ ధర రూ.110గా ఉంది. 
 
నిజానికి ఈ పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. విశాఖలో లీటరు పెట్రోలు ధర రూ.106.80 ఉంటే, విజయవాడలో రూ.107.63గా ఉంది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధర రూ.110గా ఉంది. 
 
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు ధర రూ.108.92గా ఉంటే డీజిల్‌ను రూ.100.39కి విక్రయిస్తున్నారు. ఒక్క పెట్రోలే కాదు, వంట గ్యాస్ ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. విశాఖలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.841గా ఉంటే, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 904గా ఉంది.
 
కాగా పెట్రోల్ నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణా ఛార్జీలే ధరల్లో తేడాలకు కారణమని చమురు సమస్థలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒకే నగరంలోనూ ధరల్లో వ్యత్యాసం ఉండడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments