Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెంచ‌రీ దాటేసిన పెట్రోల్ ధ‌ర‌.. లీట‌ర్ రూ.102.47

Webdunia
శనివారం, 29 మే 2021 (16:45 IST)
ఓవైపు క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంటే.. మ‌రోవైపు పెట్రోల్ బాదుడు ఆగ‌డంలేదు.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నిక‌ల పుణ్య‌మా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ ప‌డ‌గా.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైంది. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర‌… విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర రూ.102.47కు పెరిగింది.. ఇక‌, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.94.12గా ప‌లుకుతోంది.. గత నాలుగు రోజులుగా వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుల‌కు గుబులు పుట్టిస్తున్నాయి పెట్రోల్ ధ‌ర‌లు.
 
అయితే, క్రూడాయల్ నుండి రిపైడ్ చేసి మనకి వచ్చేసరికి వర్జినల్ కాస్ట్ లీట‌ర్‌కు రూ.34గా ఉంది.. మిగిలినవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాక్సులే… ట్రాన్స్‌పోర్ట్ 28 పైసలు అయితే, ఎక్సైజ్ సుంకం రూ.32.90, డీల‌ర్ క‌మిష‌న్ రూ.3.45, స్టేట్ వ్యాట్ 31 శాతం అంటే రూ.21.47, సెస్ రూ.4.. అన్ని కలిపి సెంచూరి ద‌గ్గ‌ర‌కు నార్మల్ పెట్రోల్ ధర చేర‌గా.. స్పీడ్ అయితే ఇప్ప‌టికే వంద దాటేసింది.. ఇక‌, డీజిల్ ధ‌ర విష‌యానికి వ‌స్తే.. అస‌లు ధ‌ర లీట‌ర్‌కు రూ.38.35కాగా.. ఎక్సైజ్ సుంకం.. రూ.31.81, డీలర్ కమిషన్ రూ.2.25, ఎల్ఎస్ఆర్ 36 పైసలు, వ్యాట్ రూ.15.96, రోడ్ టాక్స్ రూ.1గా ఉంది. మొత్తంగా కేంద్ర, రాష్ట్రాల ప్ర‌భుత్వాలు.. పెట్రోల్, డీజిల్‌పై అందిన‌కాడికి పిండుకునే ప‌నిలో ప‌డిపోయాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments