అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో ముడి చమురు ఖరీదైన తర్వాత సైతం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగలేదు. అయితే, ముడి చమురు రేట్లు తగ్గిన అనంతరం పెట్రోల్, డీజిల్‌పై నాలుగుసార్లు తగ్గించారు. దీంతో పెట్రోల్ లీటర్‌కు 77 పైసలు, డీజిల్‌పై 74 పైసలు వరకు తగ్గించాయి.
ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరుసగా, రోజువిడిచి రోజు చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 15 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెంచాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. రూ. 94.43గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.97.63, లీటర్ డీజిల్ రూ.92.54కు పెరిగింది.
ఇకపోతే.. ఒపెక్ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్ 1న జరుగనుంది. రాబోయే జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి. యూఎస్ మార్కెట్లో బ్రెంట్ ముడి శుక్రవారం బ్యారెల్‌కు 69.46 డాలర్లు పలికింది. డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 0.53 డాలర్లు తగ్గి.. 66.32 డాలర్లకు చేరుకుంది.