Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:28 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో 80 పైసలు గరిష్టంగా పెరిగిన ఇంధన ధరలు బుధవారం సెంచరీ కొట్టాయి. దేశ రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు చేరుకుంది. మొత్తంగా లీటరు పెట్రోల్‌పై రూ.4.80 వరకు ధర పెరిగింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రేటు రూ.90.77 నుంచి రూ.91.47 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిల్లో ధరలు మండుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.113.61, లీటరు డీజిల్ ధర రూ.99.84కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై నెటిజన్లు చేస్తోన్న జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
 
కోహ్లి కంటే ముందే పెట్రోల్ సెంచరీ కొట్టిందంటూ ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సామాన్యుని చెంపలు వాయిస్తుందంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇలా ఇంధన ధరలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments