Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశమే హద్దుగా పెట్రోల్ ధరలు... జూన్‌లోనే ఆరుసార్లు పెరిగాయ్

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (10:34 IST)
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతుంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. 
 
పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్‌ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌ ధర రూ.5.81, డీజిల్‌ ధర రూ.6.12 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. మరొకొన్ని చోట్ల సెంచరీకి చేరువగా ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106 పలుకుతోంది. 
 
తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.85కు పెరిగింది. డీజిల్‌ రూ.86.75కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.61, డీజిల్‌ రూ.94.56, ముంబైలో పెట్రోల్‌ రూ.101.04, డీజిల్‌ రూ.94.15గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments