Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్‌తో పోటీపడుతున్న డీజల్ ధర : సెంచరీకి చేరువలో...

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (08:40 IST)
దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం  నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
 
హైదరాబాద్‌ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.100.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.17గా ఉంది.
 
ఇకపోతే, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.102.66కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.41లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.101.35 ఉండగా.. డీజిల్ ధర రూ.95.41గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.91లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.41గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.44గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.53గా ఉంది. 
 
ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.96.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.28 లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.58కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.70 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.34 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.12 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.69ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments