జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. నిర్ణయం రాష్ట్రాలదే: అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా వుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లు స్పష్టం చేశారు. అయితే జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజీల

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (17:03 IST)
కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా వుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లు స్పష్టం చేశారు. అయితే జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజీల్ వస్తే... వాటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. కానీ జీఎస్టీ కింద పెట్రోల్, డీజిల్ వస్తే రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టినట్లవుతుందని.. దీంతో రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 
 
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్, ఎక్సైజ్ డ్యూటీలకు తోడు రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌తో పెట్రోల్, డీజిల్ సామాన్యుడికి భారంగా మారాయి. ఒకవేళ జీఎస్టీలోని గరిష్ఠ స్లాబ్ 28 శాతం కిందికి తీసుకొచ్చినా పెట్రోల్ రేట్లు చాలా వరకు తగ్గుతాయి.
 
ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని జైట్లీ ప్రకటించారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని జైట్లీ స్పష్టం చేశారు. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ను తగ్గించాయి. అలా కాకుండా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వున్నట్లు ప్రకటించింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం వుందని జైట్లీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments