Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ చరిత్రలో తొలిసారి.. పెట్రోల్ - డీజిల్ ధరలు సమానం

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:51 IST)
దేశ చరిత్రలో తొలిసారి ఓ రికార్డు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. గత 17 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. బుధవారం అంటే 18వ రోజు కూడా ఈ ధరలు పెట్రో ధరలు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. ఫలితంగా దేశంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
దేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, నిత్యమూ 'పెట్రో' ధరలను పెంచుకుంటూ పోతుండగా, ఈ 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.10 వరకూ ధర పెరిగింది. ఇదేసమయంలో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
ప్రస్తుతం హస్తినలో పెట్రోలు ధర లీటరుకు రూ.79.88వుండగా, డీజిల్ ధర రూ.79.40కి చేరుకుంది. ఏ దేశంలోనైనా పెట్రోల్‌తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. 
 
అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీ‌గా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరా సమానమైంది. 
 
కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు. ఈ నగరాల్లో మాత్రం వీటి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments