Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ - పాన్ కార్డు అనుసంధానానికి తుది గడువు ఇదే...

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (10:17 IST)
పాన్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత ఆధార్‌ కార్డుతో పాన్ కార్డును లింకు చేయడం సాధ్యంకాదని ఐటీ శాఖ హెచ్చరిస్తుంది. 
 
నిజానికి ఈ రెండు నంబర్ల అనుసంధానానికి ఇప్పటికే పలుమార్లు ఆదాయపన్ను శాఖ గడువు ఇచ్చింది. పలు మార్లు పొడగించింది కూడా. ఈ నేపథ్యంలో మరోమారు గడవు పొడగించే ప్రసక్తే లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల 2023 మార్చి 31వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని తెలిపింది. 
 
ఈ యేడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఆదాయపన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింకు కోసం రూ.వెయ్యి చొప్పున సూలు చేస్తుంది. వచ్చే యేడాది మార్చి వరకు రూ.వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింకు చేసుకోవచ్చని చెబుతోంది. 
 
ఈ రెండు నంబర్లను మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చు. 
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి క్విక్ లింక్ విభాగంలో లింక్ ఆధారం ఎంపికై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబరును, ఆధార్ నంబరును, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
 
పాన్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీని ఎంటర్ చేయాలి. వాలిడేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రూ.వెయ్యి అపరాధం చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments