Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సంక్షోభంలో పాక్... దారుణంగా పడిపోయిన మారకం విలువ

చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా విదేశీ ద్రవ్య నిల్వలు 12.9 బిలియన్ డాలర్లకు చేరాయి.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (11:26 IST)
చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా విదేశీ ద్రవ్య నిల్వలు 12.9 బిలియన్ డాలర్లకు చేరాయి. పాకిస్థాన్‌లో రోజురోజుకూ దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు చేపట్టిన ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించడం లేదు. 
 
ఫలితంగా మంగళవారం పాకిస్థాన్ రూపాయి మారకం విలువ మరింతగా దిగజారింది. సాయంత్రం 4:57 గంటలకు కరాచీలో ఆ దేశ రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. 1.9 శాతం క్షీణించి డాలర్‌కు 109.5 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారకం విలువ ఇంత దారుణంగా క్షీణించడం ఇదే తొలిసారి.
 
రూపాయి మారకం విలువ పడిపోవడంపై పాక్ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వకార్ మసూద్ మాట్లాడుతూ ‘ఇది అసాధారణం’ అని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పడిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ప్రభుత్వం గతనెలలో 2.5 బిలియన్ డాలర్లు అప్పు చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments