Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం...

ఆకాశంలో అద్భుతం జరుగనుంది. బుధవారం రాత్రి ఇది కనిపించనుంది. జెమిని తారామండలం నుంచి వచ్చే ఉల్కలను బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బైనాక్యులర్లు, టెలిస్కోపుల అవసరం లేకుండానే ప్రజలు చూడవ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (10:07 IST)
ఆకాశంలో అద్భుతం జరుగనుంది. బుధవారం రాత్రి ఇది కనిపించనుంది. జెమిని తారామండలం నుంచి వచ్చే ఉల్కలను బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు బైనాక్యులర్లు, టెలిస్కోపుల అవసరం లేకుండానే ప్రజలు చూడవచ్చునని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా నక్షత్రశాల సంచాలకుడు దేవీప్రసాద్‌ దురై వెల్లడించారు.
 
నగర కాంతులకు దూరంగా.. చీకటి ప్రదేశాలకు వెళ్తే ఉల్కాపాతాన్ని మెరుగ్గా వీక్షించవచ్చునని ఆయన సూచించారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఉల్కాపాతం తారస్థాయిలో ఉంటుందని దేవీప్రసాద్‌ చెప్పారు. ఈ తరహా ఉల్కాపాతం చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. 

ఈ ఉల్కాపాతాన్ని  చూసేందుకు ప్రత్యేకంగా ఖగోళ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 2 గంటల వరకు భారీగా ఉల్కలు ఆకాశంలో కనువిందు చేస్తాయని అన్నారు. ఈ ఉల్కలు రాలుతున్న తారల్లా కనిపించనున్నాయి. మిథునరాశి కూటమిలో ఉల్కలు మెరుస్తూ కనిపిస్తాయని, దాదాపు గంటకు 120 వరకు ఉల్కలు పతనం కానున్నాయని తెలిపారు. చీకటి ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి ఉల్కలు స్పష్టంగా కనిపిస్తాయని దురై తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments