Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ ప్రచారానికి ముఖచిత్రంగా సోనూసూద్

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (18:25 IST)
‌ భారతదేశం మరోమారు ముందుకు పయనం ఆరంభించింది. ప్రయాణాలు తిరిగి  ప్రారంభమయ్యాయి కానీ వైవిధ్యంగా. నిత్యం మారుతుండే ప్రయాణ ధోరణులను మరియు వినియోగదారుల సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఇప్పుడు శానిటైజ్డ్‌ స్టేస్‌ను మే 2020లో యునిలివర్‌తోభాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. దీనిద్వారా తమ శానిటైజేషన్‌ మరియు పరిశుభ్రతా ప్రయత్నాలను వృద్ధి చేస్తున్నారు.
 
ఈ ప్రయత్నాలలో మరో అడుగు ముందుకు వేస్తూ, ఈ ఆతిథ్య రంగ సంస్థ శానిటైజేషన్‌ ప్రయత్నాలను వాస్తవ సమయంలో ప్రదర్శించడంతో పాటుగా ప్రయాణీకుల నడుమ విశ్వాసాన్ని నిర్మించేందుకు నేడు ఓయో తమ సమగ్రమైన ప్రచారం- ఎస్‌బీవైఈ లేదా శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌‌ను బాలీవుడ్‌ నటుడు మరియు ఓయో ఎస్సెట్‌ యజమాని సోనూసూద్‌ను ఈ ప్రచార ముఖ చిత్రంగా ఆవిష్కరించింది. వినియోగదారులపై దృష్టి కేంద్రీకరించిన ఈ ప్రచారాన్ని టీవీ మరియు డిజిటల్‌ వేదికలపై తమ మొదటి యాడ్‌-‘ పెహలే స్ర్పే, ఫిర్‌ స్టే’ అంటూ నేడు విడుదల చేశారు.
 
రాష్ట్రాల నడుమ సరిహద్దులు మరోమారు పర్యాటకులను ఆహ్వానించేందుకు తెరువబడ్డాయి. దగ్గరలోని కొండ ప్రాంతాలకు లేదంటే దగ్గరలోని బీచ్‌కు వెళ్లడానికి లేదా తమ నగర సరిహద్దులలోనే స్టేకేషన్‌ను ఆస్వాదించడానికి భారతీయులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వినియోగదారులు నమ్మకమైన వసతి, విధానాలను తమ ఆందోళనలను పొగొట్టుకునేందుకు వెదుకుతున్నారు.
 
ఇది అర్థం చేసుకుని, ఓయో యొక్క తాజా ప్రచారం, శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ ద్వారా వినియోగదారులకు మనశ్శాంతిని అందిస్తున్నాం. ఇది అభ్యర్ధించిన మీదట అందించే కార్యక్రమం. దీనిద్వారా ఓయో అతిథులు హోటల్‌ యొక్క సిబ్బందిని అత్యధికంగా తాకే ప్రాంగణాలను శానిటైజ్‌ చేయాల్సిందిగా అడగవచ్చు లేదా తరచుగా స్పృశించే ప్రాంగణాలను తమ కళ్లముందు శుభ్రపరచాల్సిందిగా కోరవచ్చు. ముఖ్యంగా ఈ శానిటైజేషన్‌ ప్రక్రియను రెండు విధానాలు- ఏరోసోల్‌ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ మరియు/లేదా స్ర్పే హ్యాండీ శానిటైజర్‌ మెషీన్‌ ద్వారా చేస్తారు.
 
ఈ నూతన టీవీ మరియు సామాజిక చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కనిపిస్తారు. ఈ చిత్రంలో సోనూసూద్‌ ఎరుపురంగు ఒయో టీ షర్ట్‌లో కనిపిస్తారు. ఈ యాడ్‌లో సంతోషకరమైన క్షణాలు ఎన్నో ఉంటాయి. అదే సమయంలో బ్రాండ్‌ యొక్క ఎస్‌బీవైఈ అనుభవాలను వైవిధ్యంగా తెలుపుతుంది. ఉదాహరణకు, అతిథులు తమ గదిలో లైట్లను ఆన్‌చేయడానికి ప్రయత్నించాలనుకునే లోపుగానే సోనూసూద్‌ అతిథులు మాట బయటకు రాకమునుపే మాస్టర్‌ స్విచ్‌బోర్డ్‌పై స్ర్పే చేస్తారు. అదే రీతిలో అతిథులు టీవీ స్విచ్‌ దగ్గరకు చేరుకునే లోపుగానే టీవీ రిమోట్‌ కంట్రోల్‌పై స్ర్పే చేయడంతో పాటుగా ఇతర వస్తువులను సైతం స్ర్పే చేస్తారు.
 
ఈ ప్రచారం గురించి మయూర్‌ హోలా, హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ బ్రాండ్‌, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ మాట్లాడుతూ, ‘‘నమ్మకం మరియు ప్రేమ అనేది ఛాయ్‌ , బిస్కెట్‌ లాంటివి. శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ కార్యక్రమమనేది బ్రాండ్‌ యొక్క నమ్మకానికి పునాదిగా నిలుస్తుంది.

మా వినియోగదారులు ఇటీవల మేము నిర్వహించిన ప్రాజెక్ట్‌ హలో సందర్భంలో మమ్మల్ని అడిగారు. దీనిలో భాగంగా మేము ముఖాముఖిగా వినియోగదారులతో మాట్లాడటంతో పాటుగా వారి నేటి అవసరాలను తెలుసుకున్నాం. నేడు దానిని సాకారం చేయడం పట్ల ఆనందంగా ఉన్నాం. భారతదేశంలో ప్రయాణాలు తిరిగి ప్రారంభమైన వేళ, మా అతిథులకు శానిటైజ్డ్‌ స్టేస్‌ను అందిస్తున్నాం..’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘సోనూ మా వరకూ ఓ సెలబ్రిటీ మాత్రమే కాదు, మాలో ఒకరు ఆయన. మా ఎస్సెట్‌ యజమానులలో ఒకరు. సమాజానికి అతను అందిస్తున్న మద్దతు అద్భుతం. వాస్తవమేమిటంటే, మాకు అత్యంత గర్వకారణమైన భాగస్వాములలో ఒకరు. ఆయన కేవలం మా కోసం మాట్లాడటం వరకూ మాత్రమే కాదు, ఆయన ఓయో’’ అని జోడించారు.
 
ఓయో బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన భాగస్వామ్యం గురించి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ మాట్లాడుతూ, ‘‘ఓయోతో ఎస్సెట్‌ భాగస్వామిగా, గత కొద్ది నెలలుగా ఓయో బృందం చేపడుతున్న పలు చర్యలను తొలుత అనుభవించిన వారిలో నేనూ ఒకడిని. కేవలం అతిథులకు సురక్షిత అనుభవాలను అందించడం మాత్రమే కాదు, ప్రణాళికా ప్రక్రియ నుంచి అతిథుల ప్రయాణంలో తోడ్పాటునందిస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు ఓయో తోడ్పడుతుంది. భారతదేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలోనూ వారి నాణ్యమైన వసతులు విస్తరించి ఉన్నాయి.
 
ఈ కార్యక్రమంలో వారు భాగస్వాములు కావాల్సిందిగా కోరిన వెంటనే నేను బోర్డ్‌పై చేరాను. నేడు నాతో సహా ప్రయాణీకులందరూ పరిశుభ్రత, శానిటైజేషన్‌ కోసం ఎక్కువగా భయపడుతున్నారు. అతిథుల ఆందోళన, బాధను తీర్చేందుకు,వారు పూర్తి ఆహ్లాదకరమైన వసతి సౌకర్యాలను అనుభవించేలా ఈ ప్రచారం ఉంటుంది. ఈ ప్రచారంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను. ప్రతి రోజూ ఓయో స్వాగతించే వేలాది మంది అతిథులకు పూర్తివైవిధ్యమైన అనుభవాలను తీసుకురాగలరని నమ్ముతున్నాను’’ అనిఅన్నారు
 
దేశవ్యాప్తంగా లీజర్‌ ట్రావెల్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. 80% మంది వినియోగదారులు శానిటైజ్డ్‌ స్టేస్‌ కోసం వెదుకుతుంటే, 46% మంది వినియోగదారులు రెగ్యులేషన్‌ సంబంధిత సమాచారం కోరుకుంటున్నారని ఓయో అధ్యయనంలో తేలింది.  అది దృష్టిలో పెట్టుకుని ఓయో ఇటీవలనే ప్రయాణ సంబంధిత అవసరాలను తీర్చడం కోసం ఓయో యాప్‌పై సహాయ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో కోవిడ్-19 పరీక్షలు సైతం భాగంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments