పెట్రోల్ లేదా డీజిల్ రేట్లు ఏ రేంజ్‌లో వున్నాయో చెప్పే గూగుల్?

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (19:06 IST)
గూగుల్ మ్యాప్స్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఇంధనం (పెట్రోల్/డీజిల్) తక్కువ ఖర్చు అయ్యే దారిని కూడా ఇక చూపిస్తుందంటే.. నమ్మి తీరాల్సిందే.  రలోనే ఈ సౌలభ్యం కూడా రాబోతోంది. నిజమండి. ప్రస్తుతం పెట్రోల్ లేదా డీజిల్ రేట్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. 
 
సామాన్య జనం బైకు లేదా కారు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి వారికి గూగుల్ మ్యాప్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏ దారిలో వెళ్తే తక్కువ పెట్రోల్, డీజిల్‌తో చేరుకోగలమో చూపించే అల్గారిథమ్‌ను గూగుల్ డెవలప్ చేస్తోంది.
 
ఎంత టైమ్ ఆదా అవుతుందో చూపే బదులు కస్టమర్‌కు ఎంత ఇంధనం ఆదా అవుతుందో అంచనా వేసి నేవిగేషన్ టూల్స్ చూపిస్తాయి. దీంతో మనం తక్కువ ఇంధనంతో ఆ రూట్లో వెళ్లొచ్చు. కానీ ఇంధనం తక్కువ అయ్యే రూట్ ఆప్షన్ (ఫ్యూయల్ ఎఫీషియంట్) ఆన్ చేసి ఉన్నప్పుడు.. వేగవంతమైన మార్గాలు చూపించవు.
 
ఒక వేళ ఇవి మనం వాడితే ఫ్యూయల్ ఎఫీషియంట్ ఆప్షన్ చూపించదు. వీటితో పాటు ఇంతకు ముందు ఉన్న అన్ని ఆప్షన్లను కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు

Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్

Chiru: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం. రుషికి అభినందనగా ల్యాప్‌టాప్ బహుకరించిన చిరంజీవి

ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు

తర్వాతి కథనం
Show comments