Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 170లకే సిలిండర్.. ఎలా పొందాలో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (13:35 IST)
గ్యాస్‌ సిలిండర్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 170లకే సిలిండర్ పొందవచ్చు. అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మరో ఏడు రోజులు మాత్రమే. 
 
ఎలాగంటే.. ప్రముఖ పేమెంట్‌ యాప్‌ పేటీఎం వినియోగదారులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల గ్యాస్‌ బుకింగ్‌‌పై రూ.700 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాస్‌ బ్యాక్‌ అందుకోవాలంటే ఇలా చేయండి. 
 
పేటీఎం యాప్‌లో రీఛార్జ్‌ అండ్‌ పే బిల్‌ ఆప్షన్‌‌పై క్లిక్‌ చేయండి. బుక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఆప్షన్‌‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు వాడే సిలిండర్‌ కంపెనీని సెలెక్ట్‌ చేసుకోండి. రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ లేదా మీ ఎల్‌పీజీ ఐడీని నమోదు చేయండి. 
 
బిల్‌ పే చేసిన తర్వాత సిలిండర్‌ ను బుక్‌ చేసుకోవచ్చు. సిలిండర్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్‌ బ్యాక్‌ స్క్రాచ్‌ కార్డు వస్తుంది. ఈ కార్డును మీరు 7 రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments