Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రెండు కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించించి ఓలా ఎలక్ట్రిక్

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (17:43 IST)
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, రెండు కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తన D2C ఫుట్‌ప్రింట్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు సెంటర్లు డిచ్‌పల్లి-నిజామాబాద్ రోడ్, వినాయక్ నగర్- ఎఫ్‌సిఐ కాలనీ, సంగీత్ నగర్ ఉండగా వీటితో కలిపి కంపెనీకి నగరంలోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇటువంటి 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు కలిగి ఉండగా, కంపెనీ తన నెట్‌వర్క్‌ను మార్చి 2023 నాటికి 500 అవుట్‌లెట్‌లను చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
అన్ని సేవలను ఒకే చోట అందించాలన్న లక్ష్యంతో, ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఈవీ (EV) ఔత్సాహికులు ఓలా అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈవీ సాంకేతికత వివరాలు తెలుసుకునేందుకు, వాటి పనితీరును సొంతంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వినియోగదారులు S1 మరియు S1 ప్రో టెస్ట్ రైడ్‌లను చేసేందుకు ఓలా బ్రాండ్ ఛాంపియన్‌ల నుంచి కొనుగోలుకు సహకారాన్ని అందుకునేందుకు, ఫైనాన్సింగ్ ఎంపికల వివరాలు తెలుసుకునుందకు, ఓలా యాప్‌లో వారి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు అన్ని పోస్ట్ సేల్స్ కేర్ మరియు ఓలా స్కూటర్‌ల నిర్వహణ కోసం వన్-స్టాప్ డెస్టినేషన్లుగా రెండింటి పనితీరును అందిస్తాయి.
 
ఓలా వరుసగా ఐదు నెలల పాటు ఈవీ 2వీలర్ల సేల్స్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండడంతో పాటు దేశ వ్యాప్తంగా 200,000 కన్నా ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ నేడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ 2వీలర్ల పరిశ్రమలో కీలక స్థానంలో కొనసాగుతోంది.
 
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా S1 ప్రోపై రూ.12,000 తగ్గింపు మరియు దాని హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌తో సహా ప్రత్యేకమైన ఆఫర్‌లను విడుదల చేసింది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అలాగే, రూ.2,499 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐలను ఎంచుకోవచ్చు, 8.99% నుంచి తగ్గిన వడ్డీ రేట్లు మరియు జీరో ప్రాసెసింగ్ రుసుమును పొందవచ్చు మరియు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై అదనపు తగ్గింపులను పొందవచ్చు. వీటితో పాటు, వినియోగదారులు తమ పెట్రోల్ స్కూటర్‌లను సరికొత్త ఓలా S1ల కోసం ఎక్ఛేంజ్ చేసుకునే అవకాశంతో పాటు రూ.4,000 వరకు బోనస్‌ను పొందవచ్చు. ఓలా ప్రస్తుత వినియోగదారులు ఓలా మనీలో రూ.6,000 వరకు పొందడం ద్వారా #EndICEage రెఫరల్ ప్రోగ్రామ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments