Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీబీనగర్ వద్ద వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

godavari express
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (08:38 IST)
విశాఖపట్టణం - హైదరాబాదా ప్రాంతాల మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్  బీబీనగర్ వద్ద ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడలేదు. ఈ ఘటనలో మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, రైలు పట్టాలు తప్పడం కారణంగా వచ్చిన భారీ శబ్దానికి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణం స్పందించి హెల్ప్ లైన్ నంబరు 040-2778 6666 ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి