Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెక్సన్ ఈవీ కే2కే రికార్డు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి సవాలును స్వీకరించిన నెక్సన్

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (23:39 IST)
భారతదేశ అగ్రగామి ఆటోమొబైల్ తయారీ సంస్థ, భారతదేశ ఈవీ విప్లవంలో అగ్రగామి అయిన టాటా మోటార్స్ నేడిక్కడ శ్రీ నగర్ నుంచి కన్యాకుమారి దాకా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ-నెక్సన్ ఈవీ ఛాలెంజింగ్ జర్నీని ప్రకటించింది. ఫిబ్రవరి 25న నెక్సన్ ఈవీ ప్రయాణం ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు నాన్-స్టాప్‌గా 4000 కి.మీ. మేర ఈ ప్రయాణం సాగనుంది. (వాహనం ఛార్జింగ్ కోసం మాత్రమే ప్రయాణం నిలిపివేయబడుతుంది). ఈవీ ప్రయాణంలో వేగవంతమైన కే2కే రికార్డు సృష్టించేందుకు ఈ ప్రయత్నం జరుగుతోంది. ఒత్తిడి లేని అనుభూతిని అందించేందుకు వీలుగా, టాటా మోటార్స్ తన నెక్సన్ ఈవీ శ్రేణిని 453 కి.మీ.కు మెరుగుపర్చింది. టాటా పవర్ దేశవ్యాప్తంగా హైవే చార్జింగ్ మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది, తద్వారా ప్రజలు చార్జింగ్ వసతులను సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతుంది.
 
ఈ ప్రయాణంలో నెక్సన్ ఈవీ ప్రతికూల వాతావారణ పరిస్థితుల ద్వారా, భారత ఉపఖండపు కష్టతరపు ఉపరి తలాల మీదుగా పయనించనుంది. హైస్పీడ్‌ను నిర్వహించడం, దూర ప్రయాణం చేయడంలో నెక్సన్ ఈవీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం, అదే విధంగా దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ నెట్వర్క్ లభ్యతను తెలియజేయడం లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతోంది.
 
ఈ ఉద్వేగభరిత సాహసయాత్ర సందర్భంగా టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ స్ట్రాటజీ హెడ్ శ్రీ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, ‘‘నూతనంగా వృద్ధి చెందుతున్నసాంకేతికత కావడంతో నిజ ప్రపంచంలో ఈవీల శక్తిసామర్థ్యాలు, సాధ్యం కాగల అంశాలను ప్రదర్శించి చూపడం ఎంతో ముఖ్యం. నెక్సన్ ఈ వీతో చేసే ఈ ఆకాంక్షాపూరిత ప్రయాణం చేయడం ద్వారా, నెక్సన్ ఈవీ దీర్ఘ శ్రేణి ప్రయోజనాలపై, దానికి తోడుగా టాటా పవర్ ఎకోసిస్టమ్ భాగస్వాముల పెరిగిపోతున్న చార్జింగ్ స్టేషన్లపై గట్టి ఆధారం అందించడం ద్వారా మేం మా ప్రస్తుత, భవిష్యత్ ఈవీ యజమానులకు  స్ఫూర్తినందించాలని మేం కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
 
‘‘నెక్సన్ ఈవీతో ఈ ఉద్వేగభరిత ప్రయాణంను ప్రారంభిస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. ఇది మెరుగుపర్చబడిన 453 కి.మీ. శ్రేణి అందిస్తుంది. ఇందులోనే ఈవీని విశ్వసించే వాహన ఔత్సాహికులు నా సహచరులతో కలసి ప్రయాణిస్తున్నారు. ఇది సాధ్యమైనంత తక్కువ సమయంలో దేశ ఉత్తరభాగం నుంచి దక్షిణ భాగానికి 4000 కి.మీ. మేర ప్రయాణిస్తుంది. రోజుకు 1000 కి.మీ. ప్రయాణించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. నెక్సన్ ఈవీ ఎంతో సులభంగా ఈ పని పూర్తి చేస్తుందని మేం విశ్వసిస్తున్నాం. ఈ కే2కే డ్రైవ్ భారతదేశంలో ఈవీ వాహనాలకు మారిపోవడాన్ని అధికం చేస్తుందని, కొనుగోలుదారులకు దీన్ని ప్రధాన ఎంపికగా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.
 
దీని అంతర్గత సామర్థ్యాలతో, ‘ఎక్కడికైనా వెళ్లండి’ ఆటిట్యూడ్ తో నెక్సన్ ఈవీ అనేది ఈ గణనీయ ప్రయాణానికి కచ్చిత భాగస్వామిగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభూతితో కూడిన ఎలక్ట్రిఫయింగ్ పనితీరును అందిస్తుంది. ఇది ప్రయాణ శ్రేణిని అందించడం మాత్రమే గాకుండా, ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. నిరంతరాయ దూర ప్రయాణాలను సులభంగా పూర్తి చేసేలా చేస్తుంది.
 
అత్యాధునిక జిప్ ట్రాన్ సాంకేతికతతో కూడిన నెక్సన్ ఈవీ అనేది సౌకర్యం, నమ్మకం, పనితీరు, సాంకేతికత, ఛార్జింగ్ అనే స్తంభాలపై నిర్మితమైంది. జిప్ ట్రాన్ ఈవీ ఆర్కిటెక్చర్ అనేది వైవిధ్యభరిత, సవాల్ తో కూడిన 800 మిలియన్ల కి.మీ.కు పైగా దూరం భారతీయ ఉపరితలాలపై ప్రయాణించబడింది, నిరూపించబడింది. 453 కి.మీ. మెరుగుపర్చబడిన శ్రేణితో కూడిన నెక్సన్ ఈవీ ఫీచర్ల, స్పెసిఫికేషన్ల ప్రయోజనాలు నగరాల మధ్య, నగరంలోనూ నిరంతరాయంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి. తక్షణ టార్క్ డెలివరీ, i-VBACతో కూడిన ఈఎస్పీ, హిల్ డిసెంట్ కంట్రోల్, ఐపీ 67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్, మోటార్, ఆటో డిమ్మింగ్ ఐఆర్ వీఎం, హై గ్రౌండ్ క్లియరెన్స్, నీళ్ల గుండా చొచ్చుకుపోయే సామర్థ్యం, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో వెహికిల్ హోల్డ్ లాంటి వాటితో నెక్సన్ ఈవీ దేశంలో ఎలాంటి రోడ్డుపై అయినా దూసుకుపోయే సామర్థ్యం కలిగిఉంటుంది. ఈ మల్టీ మోడ్ రీజెన్ ఫీచర్ అనేది ప్రత్యేకంగా బ్రేకింగ్ ద్వారా కొంత మేరకు శ్రేణిని పెంచుకోవడంలో తోడ్పడుతుంది.
 
ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ లేదా ఏదైనా 15 ఎ పాయింట్ ద్వారా రెగ్యులర్ ఛార్జింగ్ వంటి పలు చార్జింగ్ ఆప్షన్లతో పని చేయగల సామర్థ్యాన్ని కలిగిఉంటూ, మారుమూల ప్రాంతాల్లో కూడా వినియోగదారు ఈ వాహనాన్ని నడిపేందుకు వీలు కల్పిస్తుంది. దీని వెంటిలేటెడ్ లెతరెట్ సీట్లు, రియర్ ఏసీ వెంట్స్, యాక్టివ్ డిస్ ప్లే మరియు రియర్ ఏసీ వెంట్స్ తో కూడిన జ్యుయల్డ్ కంట్రోల్ నాబ్ వంటి విలాస ఇంటీరియర్స్ సవాల్‌తో కూడిన ప్రయాణాలను మృదువైనవిగా, సౌకర్యవంతమైనవిగా చేస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments