Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్‌లోకి వేగనార్ కొత్త మోడల్

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:18 IST)
భారత మార్కెట్‌లోకి వేగనార్ కొత్త మోడల్ వచ్చింది. ఈ మోడల్‌ను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి విడుదల చేసింది. కొత్త 2019 ఎడిషన్‌ వేగనార్‌ న్యూ డిజైన్‌‌తో ఉంది. దీని ఫ్రారంభ ధర ఢిల్లీ షోరూమ్‌లో రూ.4.19 లక్షలుగా ఉంది. 
 
ఇకపోతే, ఈ కొత్త మోడల్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. అలాగే, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లు ఉన్నాయి.
 
కొత్త జనరేషన్‌ హ్యుండాయ్‌ శాంత్రో, టాటా టియాగోలకు పోటీగా ఈ వేగనార్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు తెలిపింది. కొత్త వేగనార్‌‌లో లీటరు ఇంజిన్‌ 67బీహెచ్‌పీ శక్తిని 90ఎల్ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. 1.2 లీటరు ఇంజిన్‌ 82బీహెచ్‌పీ శక్తిని, 113ఎన్‌ఎం టార్క్‌‌ను అమర్చింది.
 
ఈ కారులో అమర్చిన రెండు ఇంజిన్లకు కూడా 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, కొన్ని మోడల్స్‌కు మాత్రం ఏజీఎస్ (ఆటోమాటిక్‌ గేర్‌ బాక్స్‌ సిస్టమ్)ను అమర్చింది. డ్రైవర్‌ వైపు ఎయిర్‌ బ్యాగ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌తోపాటు యాంటిలాక్‌ బార్కింగ్‌ సిస్టమ్‌, సీటు బెల్టు గుర్తుచేసే విధానం, వేగాన్ని హెచ్చరించే విధానం, ప్రత్యేకమైన పార్కింగ్‌ సెన్సార్లు కొత్త వేగనార్‌‌లో ఉన్నాయి. ఈ వేగనార్ మొత్తం ఆరు రంగుల్లో లభ్యంకానుండగా, ఈ కార్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments