Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో పురుడుపోసుకునేందుకు నా కుమార్తే కారణం: ముకేశ్ అంబానీ

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. జియో పురుడుపోసుకోవడం వెనుక వున్న కథను ముకేష్ తెలిపారు. అమెరి

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:24 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. జియో పురుడుపోసుకోవడం వెనుక వున్న కథను ముకేష్ తెలిపారు. అమెరికాలో యేల్ వర్శిటీలో చదువుతున్న తన కుమార్తె ఇషా 2011లో ఇంటికొచ్చిన సందర్భంలో తనలో ఏర్పడిన ఆలోచనే జియో స్థాపనకు కారణమైందన్నారు. 
 
ఎలాగంటే.. ఓసారి తన ప్రాజెక్టు వర్క్‌ను నెట్ ద్వారా సమర్పించేందుకు ఇషా నెట్ ఆన్ చేసింది. నెట్ చాలా స్లోగా వుందని తనతో చెప్పింది. అక్కడే వున్న ఇషా సోదరుడు ఆకాశ్ వెంటనే స్పందిస్తూ.. అప్పట్లో వాయిస్ కాల్స్ ద్వారా టెలికాం సంస్థలకు డబ్బులొచ్చేవి. ఇప్పుడంతా డిజిటల్ అంటూ చెప్పాడు. ఇక భవిష్యత్తులో అంతా బ్రాండ్ బ్యాండ్‌దే హవా అంటూ చెప్పుకొచ్చాడు.
 
ఈ టెక్నాలజీ భారత్ మిస్ కాకూడదన్నాడు. వారి మాటలతో తనకు ఓ ఆలోచన తట్టింది. అదే జియో సంస్థ స్థాపనకు కారణమైందని ముకేశ్ వివరించారు. ఆ క్షణమే వాయిస్ కాల్స్‌తో పాటు డేటాను దేశ ప్రజలకు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 4జీ సేవలు దేశంలోని అందరికీ అందుబాటులోకి వచ్చిందని.. ఇక 5జీ సేవలకు కూడా సిద్ధమవుతున్నట్లు అంబానీ ప్రకటించారు.
 
కాగా.. ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సిలర్ మిట్టల్ బోల్డ్‌నెస్‌ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ''డ్రైవర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌'' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. జియో వచ్చిన తర్వాత దేశంలో మారుమూల గ్రామానికి కూడా డేటా సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. 2016లో ప్రారంభమైన జియో 2019 నాటికి భారత్‌ లీడర్‌గా నిలవబోతుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments