Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధిపతి.. భారత శ్రీమంతుడు ముకేష్ అంబానీ

ఈ యేడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ఎంపికయ్యారు. శ్రీమంతుల వార్షిక జాబితాలో జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది

ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధిపతి.. భారత శ్రీమంతుడు ముకేష్ అంబానీ
, బుధవారం, 7 మార్చి 2018 (09:26 IST)
ఈ యేడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ఎంపికయ్యారు. శ్రీమంతుల వార్షిక జాబితాలో జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ ఈ ఏడాది రెండో స్థానంలోకి వెళ్లారు. 
 
ఈ యేడాది కాలంలో అమెజాన్‌ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై రూ.11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ సంపద రూ.9,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ నిలిచారు. 7,200 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ నాలుగో స్థానంలో, 7,100 కోట్ల డాలర్లతో ఫేస్‌బుక్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఐదో స్థానంలో ఉన్నారు.
 
ఇకపోతే, భారత శ్రీమంతుల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 119 మంది శ్రీమంతుల్లో అంబానీ తొలి స్థానంలో నిలిచారు. వీరిలో 18 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. అత్యంత సంపన్న భారతీయుడైన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 4,010 కోట్ల డాలర్లుగా (దాదాపు 2.61 లక్షల కోట్లు) ఉంది. 
 
ఈ జాబితాలో 58వ స్థానంలో విప్రో అజిమ్‌ ప్రేమ్‌జీ (1,880 కోట్ల డాలర్లు), 62వ స్థానంలో ఆర్సెలర్‌ లక్ష్మీ మిట్టల్‌ (1,850 కోట్ల డాలర్లు), 98వ స్థానంలో శివ్‌ నాడార్‌ (1,460 కోట్ల డాలర్లు) ఉన్నారు. ఇక సన్‌ ఫార్మా అధినేత దిలిప్‌ సంఘ్వి 1,280 కోట్ల డాలర్ల సంపదతో 115వ స్థానంలో ఉన్నారు. రామ్‌దేవ్‌ అగర్వాల్, తరంగ్‌ జైన్, నిర్మల్‌ మిందా, రవీంద్ర కిశోర్‌ సిన్హాలు ఒక్కొక్కరు వంద కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దావూద్ ఇబ్రహీం ఫోన్ నెంబర్ డిస్‌ప్లే కాదు: సోదరుడు కస్కర్