పండుగ సీజన్‌లో రుణాలు కావాలా? ఇలా పొందవచ్చు..?

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (14:30 IST)
పండుగ సీజన్‌లో రుణాలు కావాలంటే.. ఇలా పొందవచ్చు. షాపింగ్ కోసం డబ్బు అవసరమైతే.. చేతిలో డబ్బులు లేకపోతే.. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్. తాజాగా ప్రముఖ వాలెట్ సంస్థ మొబిక్విక్ తాజాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో జతకట్టింది. ఇందులో భాగంగా కొత్తగా తొలిసారిగా వర్చువల్ ప్రిపెయిడ్ పేమెంట్స్ కార్డును తీసుకువచ్చింది. ఇది క్రెడిట్ కార్డులా పని చేస్తుంది. 
 
వాలెట్ సర్వీసుల సంస్థ నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ స్థాయికి ఎదగడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ బ్లూ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు యూజర్ వాలెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. కస్టమర్లకు రూ.లక్ష వరకు ఇన్‌స్టంట్ క్రెడిట్ లభిస్తుంది. దీంతో ఈ డబ్బుతో కస్టమర్లు తమకు నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు.
 
ఈ కొత్త ప్రిపెయిడ్ కార్డు పొందాలని భావించే వారు ముందుగా మొబక్విక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు హోమ్ స్క్రీన్‌లో పైభాగంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లోగో కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
 
కార్డు యాక్టివేట్ చేసుకోవాలి. సెకన్లలో మొబిక్విక్ కార్డు జారీ అవుతుంది. ఇకపోతే ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై కూడా కస్టమర్లకు బెనిఫిట్ కలుగుతుంది. కొనుగోళ్లపై 1 శాతం సూపర్‌క్యాష్ పొందొచ్చు. దీపావళి షాపింగ్‌పై 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పటికే మొబిక్విక్ ద్వారా దాదాపు 2 లక్ష కార్డులు జారీ అయ్యాయి. కాగా మొబిక్విక్‌కు 12 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments