Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి బంపర్ ఆఫర్-మెట్రో రైళ్ల టికెట్ ఛార్జ్ తగ్గింపు

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (14:21 IST)
సంక్రాంతి పండగ సందర్భంగా మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. మెట్రో రైళ్లలో 50 శాతం రాయితీ టికెట్ రుసుముతో ప్రయాణం చేయవచ్చని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో... నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేలా ఏర్పాటుచేసిన మెట్రోరైళ్లలో ప్రయాణికులను ఆకట్టుకునేలా సీఎంఆర్‌ఎల్‌ పలు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో భాగంగా, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో చార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం పొంగల్‌ పండుగను పురస్కరించుకుని ఈ నెల 15, 16, 17 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు.
 
17వ తేదీ కానుమ్‌ పొంగల్‌ సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌ నుంచి మెట్రో రైల్వేస్టేషన్లకు ప్రత్యేక క్యాబ్‌ వసతి ఏర్పాటుచేసింది. అలాగే, ప్రభుత్వ ఎస్టేట్‌, డీఎంఎస్‌ మెట్రో రైల్లేస్టేషన్ల నుంచి మెరీనా బీచ్‌కు క్యాబ్‌ వసతి కల్పించనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం