Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల విలీనం.. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:56 IST)
దేశంలో మరోమారు జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 10 బ్యాంకులు నాలుగు ప్రధాన బ్యాంకులుగా అవతరించాయి. ఈ బ్యాంకుల విలీనంతో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అవతరించింది. ప్రస్తుతం దేశంలో భారతీయ స్టేట్ బ్యాంకు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయంలో భాగంగా, దేశంలో ఉన్న పది ప్రధాన బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా అవతరించాయి. వీటిలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం చేశారు. 
 
ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా శాఖలు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
 
అలాగే, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేశారు. ఫలితంగా ఇది నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అదేవిధంగా అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులోనూ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంకులోను విలీనం చేశారు. దీంతో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది. ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments