Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఐ యూజర్లకు ఇక షాక్ తప్పదు.. ఏప్రిల్ 1 నుంచి ఫీజు ఖాయం

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (10:37 IST)
యూపీఐ యూజర్లు ఇకపై జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. ఏప్రిల్ 1 నుంచి మొబైల్ పేమెంట్ యాప్ కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ఫీజు వసూలు చేస్తారు. ఇందులో భాగంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి కొన్ని రకాల చెల్లింపులపై యూపీఐ ద్వారా ఇంటర్‌ఛేంజ్ వసూలు చేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది.
 
ప్రీపెయిడ్ సాధనాలైన వ్యాలెట్లు, కార్డుల ద్వారా యూపీఐ విధానంలో చేపట్టే మర్చంట్ లావాదేవీలకు 1.1 శాతం రుసుము చెల్లించాల్సి వుంటుంది. ఆన్‌లైన్‌ మర్చంట్స్‌, పెద్ద మర్చంట్స్‌, చిన్నపాటి ఆఫ్‌లైన్‌ మర్చంట్లకు చేసే…రూ.2000కు పైగా విలువైన లావాదేవీలకు ఈ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు వర్తిస్తుంది. 
 
అయితే బ్యాంకు, ప్రీపెయిడ్‌ వ్యాలెట్‌ మధ్య పర్సన్‌ టు పర్సన్‌, పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలపై ఈ రుసుములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు. 
 
అంతేగాకుండా ప్రీపెయిడ్‌ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000లకు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. అయితే గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments