Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎస్‌ఐసీ డిజైన్‌ విభాగంలో ప్రవేశించిన మెక్‌లారెన్‌ స్ట్రాటజిక్‌ వెంచర్స్‌

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (20:27 IST)
మెక్‌లారెన్‌ స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ (ఎంఎస్‌వీ) నేడు అట్లాస్‌ సిలికాన్‌ను విడుదల చేసింది. మొట్టమొదటి కృత్రిమ మేథస్సు (ఏఐ) అనుకూలీకరణ చిప్‌ డిజైన్‌ వెంచర్‌ ఇది. అంతర్జాతీయ సెమీకండక్టర్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సామర్థ్యం దీనికి ఉంది. ఒకే గూటి కింద నేపథ్యం, డిజైన్‌, ఐపీ మరియు ఉత్పత్తిని తీసుకువచ్చి డిజిటల్‌ సినర్జీలను సృష్టించే సమగ్రమైన పర్యావరణ వ్యవస్థ అట్లాస్‌ సిలికాన్‌.

 
ఈ సంస్థకు చిప్‌ డిజైన్‌లో ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉండటంతో పాటుగా అంతర్జాతీయంగా పలు విభాగాలలో అగ్రగాములైన సంస్థలతో కలిసి పనిచేయనుంది. ఈ గ్రూప్‌ వృద్ధి ప్రణాళికలను విస్తరిస్తూ ఎంఎస్‌వీ ఇప్పుడు భారతదేశంలో భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా 2025 నాటికి 300 మిలియన్‌ డాలర్ల వ్యాపారం ఏర్పాటుచేయనుంది.

 
ఎంఎస్‌వీ ఇప్పటికే విస్తృతస్ధాయిలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. భారతదేశంలో 100 ఏఎస్‌ఐసీ ఇంజినీర్లను నియమించుకోవడంతో పాటుగా దేశంలో అత్యున్నత సాంకేతిక సంస్థలతో చర్చలు జరిపి ప్రతిభావంతులైన విద్యార్థులను సైతం నియమించుకునేందుకు ప్రణాళిక చేసింది.

 
‘‘జాతీయ సెమీ కండక్టర్‌ పాలసీతో పాటుగా అనుకూలమైన భారత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భారతీయ తయారీ సామర్థ్యం మరింత విస్తరించడంతో పాటుగా ఈ విభాగంలో అపార అవకాశాలకూ కారణమవుతుంది. అట్లాస్‌ సిలికాన్‌తో భారతదేశ వ్యాప్తంగా ఏఎస్‌ఐసీ ప్రతిభావంతులు ప్రయోజనం పొందగలరు. పరిశ్రమ నిపుణుల మద్దతుతో ఔత్సాహిక యువతకు సైతం మేము శిక్షణ అందించడం ద్వారా సాటిలేని సేవలను అందించనున్నాం’’ అని సాజన్‌ పిళ్లై, ఛైర్మన్‌, మెక్‌లారెన్‌ స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ అన్నారు.

‘సామర్థ్యం కలిగిన స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మేము చూస్తున్నాము. అలాగే భారతదేశంతో పాటుగా  దక్షిణాసియా దేశాలలో  ఈ రంగంలో మధ్య తరహా కంపెనీలలోనూ పెట్టుబడులు పెట్టనున్నాము’’ అని పిళ్లై తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం