Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డుల ప్రక్షాళనకే ఆధార్‌తో అనుసంధానం

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (13:32 IST)
ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని సూచించింది. అయితే, పాన్‌-ఆధార్‌ అనుసంధానం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. 
 
అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్‌ కార్డుతో అనుసంధానం కానట్లు తేలితే ఇకపై కొత్త వర్చువల్‌ పాన్‌ నంబర్‌ కేటాయిస్తారు. 
 
ఇకపై అదే పాన్‌ నంబర్‌ కానుంది. పాన్‌ కార్డు లేనివారికీ ఒక విధంగా ఉపయోకరం. అదే వారికి పాన్‌ నంబర్‌ కానుంది. అయితే, ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. చేయని పక్షంలో శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు.
 
ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా.. 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి. మిగిలిన 18 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ చేయాల్సి ఉంది. ఈ రెండింటి అనుసంధానం కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే అవి నకిలీగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటి అనుసంధానం తప్పనిసరిచేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments