Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీఏఆర్-ఐఐఎస్‌ఆర్‌ నుంచి బయో క్యాప్సూల్స్‌ సాంకేతిక లైసెన్స్‌ అందుకున్న కృష్ణ ఆగ్రో

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (18:32 IST)
గత ఆరు సంవత్సరాలుగా రైతులకు నానో బయో గుళికలను కృష్ణ ఆగ్రో బయో ప్రోడక్ట్స్‌ సరఫరా చేస్తుంది. ఇప్పుడు కృష్ణ ఆగ్రో బయో ప్రొడక్ట్స్‌కు ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసెస్‌ రీసెర్చ్‌, కొజికోడ్‌, కేరళ అభివృద్ధి చేసిన పేటెంటెడ్‌ సంపుటీకరణ సాంకేతికతను వినియోగించుకునేందుకు లైసెన్స్‌ మంజూరు చేశారు.
 
మెరుగైన నేల పోషక ద్రావణీకరణ, వృద్ధి, దిగుబడి కోసం వ్యవసాయ పంటలకు పంపిణీ చేసే జెలటిన్‌ గుళికలకు ఆకర్షితమయ్యే సూక్ష్మ జీవుల సంపుటీకరణను ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది. ఈ పరిజ్ఞానాన్ని అన్ని రకాలగానూ వ్యవసాయ పరంగా అతి ముఖ్యమైన సూక్ష్మజీవులైనటువంటి, ఎన్‌- ఫిక్సర్స్‌; న్యూట్రియంట్‌  సొల్యుబ్లిజర్స్‌/మొబిలైజర్లు, మొక్కల వృద్ధిని ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా (పీజీపీఆర్‌), ట్రైకోడెర్మా, బుర్కోల్డెరియా మొదలైనవ  వాటిని అందించడానికి ఉపయోగించవచ్చు.
 
ఈ భాగస్వామ్యం గురించి కృష్ణ ఆగ్రో బయో ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ శ్రీ సుమన్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో 60-65 లక్షల మంది రైతులు ఉన్నారు. మా వినియోగదారుల సేవా కేంద్రాన్ని నేరుగా సంప్రదించడం ద్వారా వారు ప్రయోజనం పొందుతున్నారు. ఈ అనుమతి పొందిన సాంకేతికత కేవలం పంటలకు స్మార్ట్‌, ఖచ్చితమైన డెలివరీ అందించడం మాత్రమే కాదు అత్యధిక సూక్ష్మజీవులను నిర్వహించడమూ చేస్తుంది.
 
అదనంగా, ఇది గది ఉష్ణోగ్రతలో సైతం స్థిరంగా ఉండటంతో పాటుగా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. వీటితో పాటుగా  కెఎంబీ గుళికలు గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా విక్రయించబడుతున్నాయి. కెఏబీపీ ఇప్పుడు ఇతర న్యూట్రియంట్‌  సాల్యుబ్లైజర్లు/మొబిలైజర్లను తయారు చేయడంతో పాటుగా నేరుగా రైతులకు ఈ-కామ్‌ మార్గంలో కృష్ణ ఆగ్రో బయో ప్రొడక్ట్స్‌ వెబ్‌సైట్‌ మరియు యాప్‌ ద్వారా పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా, రైతులకు గణనీయంగా ఆదా చేయడంతో పాటుగా వారికి అదనపు లాభాలనూ జోడిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘ఈ సంపుటీకరణ సాంకేతికత ఎఫ్‌సీఓ అవసరాలను అందుకుంటుంది. అందువల్ల ఒక లక్షకు పైగా ఎకరాలలో అతి సులభంగా వినియోగించవచ్చు. రైతులకు భారీ కొనుగోళ్లకూ ఇది మద్దతునందిస్తుంది’’ అని ఆయన జోడించారు.
 
ఈ సంపుటీకరణ సాంకేతికత, రైతులకు అదనపు ప్రయోజనాలను సైతం అందిస్తుంది. వీటిలో స్మార్ట్‌ మరియు ఖచ్చితమైన రీతిలో పంటలకు సూక్ష్మజీవులను అందించడం, అధిక సూక్ష్మజీవుల జనాభా నిర్వహణ, గ్రీన్‌ సాంకేతికత, పూర్తి పర్యావరణ అనుకూలం, అతి తక్కువ ఉత్పత్తి వ్యయం, సులభంగా నిర్వహించడంతో పాటుగా నిల్వ చేయవచ్చు, అధిక జీవిత కాలం, సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, వ్యవసాయ పద్ధతుల్లో వినియోగించేందుకు భారీ యంత్రసామాగ్రి లేకపోవడం వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments