Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమండ్రిలో తమ తొలి స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌

Advertiesment
Soch
, శుక్రవారం, 30 జులై 2021 (18:20 IST)
ఫ్యాషన్‌ ప్రేమికుల ఎథ్నిక్‌ వస్త్రావసరాలను తీర్చడంలో ఏకీకృత కేంద్రంగా నిలిచిన సోచ్‌, రాజమండ్రి నగరంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్‌ 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలో తమ పాదముద్రికలను బలోపేతం చేసుకోవడంలో బ్రాండ్‌ ప్రయత్నాలకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది.
 
ఇప్పటికే విజయవాడ, వైజాగ్‌, నెల్లూరు, గంటూరు మరియు భీమవరంలలో సోచ్‌ తమ స్టోర్లను నిర్వహిస్తుంది. రాజమండ్రి స్టోర్‌లో బ్రాండ్‌ యొక్క తాజా కలెక్షన్‌ ప్రదర్శించనున్నారు. ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్‌లో ఫ్లూయిడ్‌ సిల్‌హ్యుటీస్‌, బ్రీజీ స్ట్రక్చర్స్‌, లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌ వంటివి సైతం ఉంటాయి. విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తాలు, టునిక్స్‌, కుర్తీ సూట్స్‌ మరియు డ్రెస్‌ మెటీరియల్స్‌ నుంచి వినియోగదారులు ఎంచుకోవచ్చు.
 
ఈ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా వినయ్‌ చట్లానీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ-సోచ్‌ అప్పెరల్స్‌ మాట్లాడుతూ, ‘‘రాజమండ్రిలో మా మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మా చేరికను విస్తరించాం. ఈ ప్రాంతంలోని మా వినియోగదారులకు మా నూతన కలెక్షన్‌ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నాం. అసలైన సోచ్‌ అనుభవాలను ఈ స్టోర్‌ అందించనుంది’’ అని అన్నారు.
 
దేశంలో సోచ్‌ గత 16 సంవత్సరాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 నగరాలలో 136 స్టోర్లు సోచ్‌కు ఉన్నాయి. వీటితో పాటుగా సోచ్‌ ఇప్పుడు సెంట్రల్‌వద్ద షాప్‌ ఇన్‌ షాప్స్‌ నిర్వహిస్తుండటంతో పాటుగా తమ సొంత వెబ్‌సైట్‌ సోచ్‌ డాట్‌ కామ్‌, ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ అయిన అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, టాటా క్లిక్‌, అజియో, న్యాకా వంటి వాటి వద్ద కూడా లభ్యమవుతుంది.
 
ప్రధాన మెట్రో నగరాలతో పాటుగా టియర్‌ 2 పట్టణాలలో సైతం విస్తరించేందుకు ప్రణాళిక చేసింది సోచ్‌. దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో విస్తృతమైన సోచ్‌ ఇప్పుడు ఉత్తర, తూర్పు భారతదేశాలలో తమ ఉనికిని బలంగా చాటడానికి ప్రయత్నిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవ్వూరు మునిసిప‌ల్ వైస్ ఛైర్మన్‌గా గండ్రోతు అంజ‌లీ దేవి