Publish Date: Thu, 29 Jul 2021 (16:51 IST)
Updated Date: Thu, 29 Jul 2021 (16:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే గురువారం కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2107 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,154 కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో మరో 20 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,332 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1807 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 78,784 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,44, 03, 410 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,24,543 లక్షలకు చేరింది.
సెల్వి
Publish Date: Thu, 29 Jul 2021 (16:51 IST)
Updated Date: Thu, 29 Jul 2021 (16:52 IST)