Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిస్నా డైమండ్-గోల్డ్ జ్యువెలరీ- అన్సార్ జ్యువెలర్స్ గ్రాండ్ లక్కీ డ్రా: లక్కీ విన్నర్‌కి కారు

ఐవీఆర్
శనివారం, 2 నవంబరు 2024 (18:47 IST)
కిస్నా డైమండ్ & గోల్డ్ జువెలరీ, అన్సార్ జ్యువెలర్స్ భాగస్వామ్యంతో, నంద్యాలలోని సౌజన్య కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్ కిస్నా లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించింది. అదృష్టవంతులైన విజేతగా మహమ్మద్ రఫీ ఎంపిక చేయబడ్డారు. సరికొత్త కారును ఇంటికి నడుపుకుంటూ వెళ్లారు. తమ నమ్మకమైన వినియోగదారులకు మరపురాని మార్గాల్లో ఆనంద పరచటంలో కిస్నా యొక్క నిబద్ధతను ఇది వెల్లడించింది. 
 
కిస్నా యొక్క అబ్ కి బార్ ఆప్ కె లియే షాప్ & విన్ ఏ కార్  ప్రచారం వినియోగదారులకు 100కి పైగా కార్ల నుండి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. లక్కీ డ్రా పోటీలో పాల్గొనడానికి వినియోగదారులు రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్, ప్లాటినం లేదా సాలిటైర్ ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & ఎండి శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ, “ కిస్నా వద్ద మేము చేసే ప్రతి పనిలోనూ మా వినియోగదారులు కీలకంగా ఉన్నారు. అన్సార్ జ్యువెలర్స్‌తో కలిసి చేసిన ఈ కార్యక్రమం మా వినియోగదారుల మా పట్ల చూపుతున్న విధేయత, నమ్మకానికి ఒక వేడుక. కిస్నా వద్ద, మా లక్ష్యం, ఆభరణాలను సృష్టించడం కంటే ఎక్కువగా ఉంటుంది; మేము ప్రతి వినియోగదారు జీవితంలో ఆనందం, పరిపూర్ణతను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. షాప్ & విన్ ఎ కార్ వంటి కార్యక్రమాల ద్వారా, మేము మా వినియోగదారుల విధేయతను వేడుక జరుపుకుంటాము" అని అన్నారు. 
 
కిస్నా డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ, ‘‘కిస్నాతో ప్రతి వినియోగదారు అనుభవాన్ని నిజంగా అసాధారణంగా మార్చడం, మా వినియోగదారులతో సంబంధాలను బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్సార్ జ్యువెలర్స్‌తో కలిసి నిర్వహించిన నేటి కార్యక్రమం ఆ లక్ష్యం పట్ల మా నిబద్ధతకు ఒక ఉదాహరణ" అని అన్నారు. 
 
కిస్నా సేల్స్ జనరల్ మేనేజర్ శ్రీ మహేశ్ గందాని మాట్లాడుతూ, ‘‘అన్సార్ జ్యువెలర్స్ మాకు ఒక అద్భుతమైన భాగస్వామిగా ఉంది. సంయుక్తంగా మేము  ఈ ప్రత్యేకమైన లక్కీ డ్రా కార్యక్రమం  ద్వారా మా వినియోగదారులను వేడుక జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము. వినియోగదారుల ప్రయాణంలో మరిన్ని మైలురాళ్లను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు 
 
కిస్నా , సౌత్ స్టేట్ హెడ్ శ్రీ నికుంజ్ కోరాట్ మాట్లాడుతూ, ‘‘ఈ రోజు మేము మా విలువైన వినియోగదారులను వేడుక చేస్తున్న వేళ,  అన్సార్ జ్యువెలర్స్‌తో కలిసి నిలబడడం మాకు గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల  ద్వారా, మేము కేవలం ఆభరణాలను అమ్మడం మాత్రమే కాదు; సంతోషకరమైన క్షణాలు మరియు అర్ధవంతమైన సంబంధాలతో కూడిన సమాజాన్ని నిర్మిస్తున్నాము" అని అన్నారు. 
 
అన్సార్ జ్యువెలర్స్ యజమాని శ్రీ అన్సార్ బాషా మాట్లాడుతూ, ‘‘కిస్నా భాగస్వామ్యంతో ఈ భారీ కార్యక్రమంను నిర్వహించడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము. కిస్నా తో కలిసి పనిచేయడం వలన మా వినియోగదారులకు ఉత్తమమైన వాటిని అందించడానికి మాకు అవకాశం లభించింది. ఈ గొప్ప బహుమతిని అందించడం మాకు మరియు మా విలువైన వినియోగదారులకు ఒక ఉత్తేజకరమైన మైలురాయిగా నిలుస్తుంది" అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments