రూ.999కే విమాన ప్రయాణం.. ఫెస్టివల్ సేల్... బుకింగ్స్ ప్రారంభం

దేశంలో చౌక ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ ఇపుడు మరోమారు అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ టిక్కె

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (16:31 IST)
దేశంలో చౌక ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ ఇపుడు మరోమారు అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. స్వదేశీ సర్వీసుల్లో టిక్కెట్ ప్రారంభ ధర రూ.999గాను, అంతర్జాతీయ సర్వీసులకు రూ.3199గా నిర్ణయించింది.
 
ఇందులోభాగంగా, ఈ టిక్కెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభించి, ఈనెల 16వ తేదీ వరకు విక్రయించనుంది. ఈ ఆఫర్ కింద ఏకంగా 10 లక్షల టిక్కెట్లను విక్రయానికి ఉంచింది. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లు ఈనెల 18వ తేదీ నుంచి 2019 మార్చి 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. 
 
జూలైలో 1.2 మిలియన్ సీట్లను రూ.1212 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇపుడు మరోమారు ఇదే తరహా ఆఫర్‌ కింద టిక్కెట్లను విక్రయించనుంది. 
 
కాగా, మొబిక్విక్ మొబైల్ వాలెట్ నుంచి టికెట్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇండిగో దేశ వ్యాప్తంగా రోజుకు 52 గమ్యస్థానాల్లో 1,100 విమాన సర్వీసులును నడుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments