Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి 50 ప్రత్యేక రైళ్ళ పునరుద్ధణ : రైల్వే శాఖ

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (09:51 IST)
దెబ్బకు ప్రయాణికులు లేక నిలిపివేసిన అనేక ప్రత్యేక రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి మరో 50 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ట్రైన్లను పట్టాలెక్కించగా.. ఈ నెల 21 నుంచి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొంది. 
 
ఈ నెల 25 నుంచి యూపీ గోరఖ్‌పూర్‌ నుంచి మహారాష్ట్రలోని బాంద్రా టెర్మినస్ వరకు కొత్తగా సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. సోమవారం నుంచి 50 ప్రత్యేక రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. 
 
జూన్‌ ఒకటో తేదీ నుంచి 18 మధ్య అదనంగా 660 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. గత శుక్రవారం నాటికి 983 ప్యాసింజర్‌, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి వచ్చాయి.
 
ఇదిలావుంటే, కరోనా తగ్గుముఖం పడుతుండడంతో డిమాండ్‌ మేరకు రైల్వేశాఖ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. పునరుద్ధరిస్తున్న రైళ్లలో న్యూఢిల్లీ - కల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ - డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ - అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ జంక్షన్‌ - కోట్వారా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, చండీగఢ్‌ - న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా - జమ్ముతావి దురంతో, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా - న్యూఢిల్లీ శ్రీ శక్తి, కల్కా - సిమ్లా ఎక్స్‌ప్రెస్‌, బిలాస్‌పూర్‌ జంక్షన్‌ - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌, జమ్ముతావి - యోగానగరి రిషికేశ్‌ ఎక్స్‌ప్రెస్‌, లక్నో - ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌, ఛప్రా - లక్నో జంక్షన్ మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడువనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం