Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ వినియోగదారులకు శుభవార్త - తగ్గనున్న ధరలు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (10:57 IST)
పెట్రోల్ వినియోగదారులకు ఇది నిజంగానే శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వాహనదారులపై ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది. ఇందులోభాగంగా, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులో ఉన్న 5 మిలియన్ క్రూడాయిల్‌లో బ్యారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఇంధన సరఫరా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, ఈ నెల మొదటి వారంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశ వ్యాప్తంగా కొంతమేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అలాగే, కేంద్రం వినతి మేరకు పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై తాము విధిస్తున్న వ్యాట్‌ను కూడా తగ్గించాయి. 
 
అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100కు పైమాటగానే వున్నాయి. ఈ నేపథ్యంలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిలీజ్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో చర్చించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో పెట్రోల్ ధరలు మరింతగా తగ్గే అవకాశంవుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments