Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021'లో వాటర్‪బేస్ లిమిటెడ్‌కి అవార్డు

Advertiesment
అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021'లో వాటర్‪బేస్ లిమిటెడ్‌కి అవార్డు
, సోమవారం, 22 నవంబరు 2021 (19:43 IST)
విజయవంతమైన రొయ్యల సాగుకి ఉత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులు, సేవలు అందించడంపై దృష్టిపెట్టి, భారతదేశపు ష్రింప్ అక్వాకల్చర్‌లో పురోగామి అయిన వాటర్‪బేస్ లిమిటెడ్‌కి, 'అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021' లో ఫుడ్ ప్రోడక్ట్స్ విభాగంలో అవార్డు లభించింది.

 
'అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021' ఫుడ్ ఫ్రోడక్ట్స్ విభాగంలో వాటర్‪బేస్ లిమిటెడ్ ని విజేతగా నిర్ణయించేరు. ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత ప్రభుత్వ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ అవార్డుని ప్రదానం చేసేరు.

 
ఫుడ్ ప్రాసెసింగ్, శుభ్రత & ఆహార భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ సాంకేతికత, తయారీలో ఉత్కృష్టత, ఆహార సాంకేతికత పరిశోధనల్లో ఇంజనీరింగ్ శ్రేష్టతని, సృజత్మక భావనల్ని ఈ అవార్డు గుర్తిస్తుంది. భారత ప్రభుత్వంవారి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖల క్రింద పనిచేస్తున్న వివిధ భారత ప్రభుత్వ ఏజన్సీల భాగస్వామ్యంతో ఈ అవార్డు పథకాన్ని రూపుదిద్దేరు.

 
ఈ అవార్డు పొందిన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ రమాకాంత్ ఆకుల - సిఇఒ - వాటర్‪బేస్ లిమిటెడ్, మాట్లాడుతూ, "మేం చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక గుర్తింపు, ఇది మాకు ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 28 ఏళ్ళ నిబద్ధ ప్రయాణంలో, భరణీయమైన మరియు నాణ్యతా ఉత్పత్తుల్ని అందించడం మీదే ప్రధానంగా దృష్టిపెట్టేం. ఇందుకోసం, మా కార్యకలాపాలన్నీ పర్యావరణాన్ని రక్షించడం, సామాజికంగా బాధ్యతగా వ్యవహరించడం, రొయ్యలు ఆరోగ్యంగా, తినడానికి వీలైనట్టుగా వుండేలా చూడ్డానికి ఉత్తమ మేత విత్తులు, సాగు రక్షక ఉత్పత్తులని అందించేదిశలోనే నిర్వహిస్తున్నాం" అన్నారు.

 
శ్రీ ఆకుల, ఈ సందర్భంగా, "అగ్రి-ఫుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2021' లో ఫుడ్ ఫ్రోడక్ట్స్ విభాగంలో అవార్డు పొందడం అన్నది ఖచ్చితంగా మా వాటర్ బేస్ లిమిటెడ్ కీర్తికిరీటంలో కలికితురాయే, భవిష్యత్తులో ఇలాటి మరిన్ని గుర్తింపులు సాధించగలమని ఆశిస్తున్నాను" అనికూడా అన్నారు.

 
ష్రింప్ ఆక్వాకల్చర్ ని భారతదేశానికి తీసుకురావడంలో వాటర్‪బేస్ పురోగామిగా నిలించిది. అప్పటి నుంచి, దేశంలో రొయ్యల సాగుకు సంబంధించి ఆది నుంచి తుది వరకూ అన్ని పరిష్కారాలూ అందించడానికి కట్టుబడి పనిచేస్తోంది. గణ్యులైన రొయ్య (ఆక్వాకల్చర్) రైతులకి, దాని భాగస్వాములకి ఇందుకు సంబంధించిన జ్ఞానాన్ని, సేవలని అందించడంమీద కంపెనీ ఎప్పుడూ ప్రధానంగా దృష్టిసారించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీ కేశినేని నానిని అరెస్టు చేయబోయిన పోలీసులు...