Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగుమతి సుంకాలను తగ్గించిన కేంద్రం.. దిగిరానున్న వంట నూనెలు

Webdunia
బుధవారం, 25 మే 2022 (09:32 IST)
దేశంలో వంట నూనెల ధరలు ఆకాశంలో ఉన్నాయి. వీటి ధరలను చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరగుతున్న యుద్ధం కారణంగా దేశంలో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, ఇంధన ధరలు, వంట నూనెల ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నూనెల దిగుమతిపై వసూలు చేస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ఈ విషయాన్ని మంళవారం ప్రకటించింది. 
 
ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం