ఖాతాదారులు, ఖాతాదారులు కానివారికి సైతం జీఎస్టీ చెల్లింపులను అనుమతిస్తోన్న ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

ఐవీఆర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (15:58 IST)
హైదరాబాద్: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తమ ఖాతాదారులతో పాటుగా ఖాతాదారులు కాని వారికి కూడా జీఎస్టీ చెల్లించే సౌకర్యాన్ని అందిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ సౌకర్యం ఈ క్రింది ఫీచర్లను అందిస్తుంది:
 
1. ఖాతాదారులతో పాటుగా ఖాతాదారులు కాని వారికి కూడా తెరిచి ఉంది.
2. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు జీఎస్టీ చెల్లించవచ్చు.
3. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా కూడా కస్టమర్లు చెల్లించవచ్చు (డిడి /చెక్/నగదు ద్వారా).
4. డౌన్‌లోడ్ చేసుకోదగిన చలాన్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
 
ఇది విస్తృత శ్రేణి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం, అవకాశాలను పెంచుతుంది.
 
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ హెడ్ శ్రీ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ, యూనివర్సల్ బ్యాంక్‌గా, మా కస్టమర్లకు పూర్తి శ్రేణి సేవలను అందించడమే మా లక్ష్యం. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఖాతాదారులతో పాటుగా ఖాతాదారులు కాని వారికి కూడా ఇప్పుడు యుపిఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా జిఎస్టి చెల్లింపు చేయవచ్చు. అందువల్ల, పన్ను చెల్లింపులు ఇప్పుడు సౌకర్యవంతంగా, అనుకూలమైన రీతిలో చేయవచ్చు. ప్రపంచ స్థాయి డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడానికి, పన్ను చెల్లింపుదారులందరికీ ఇబ్బందులు లేని చెల్లింపు అనుభవంతో సాధికారత కల్పించడానికి చేస్తోన్న మా విస్తృత ప్రయత్నంలో ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావటం ఒక భాగం అని అన్నారు. 
 
జిఎస్టి వసూలు కోసం అనుమతి కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి. విస్తృత పర్యావరణ వ్యవస్థకు సార్వత్రిక బ్యాంకింగ్ పరిష్కారాలు, సమగ్ర ఆర్థిక సేవలను అందించడంలో దాని నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి జిఎస్టి చెల్లించడానికి ఈ కింది దశలు అనుసరించాలి.
 
1. జీఎస్టీ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి: services.gst.gov.in/services/login
 
2. చలాన్ సృష్టించి ఈ -చెల్లింపు-> నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డ్/భీమ్ యుపిఐ ఎంచుకోండి.
 
3. చెల్లింపు ఎంపికగా ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌ని ఎంచుకుని చెల్లింపును పూర్తి చేయండి.
 
4. జిఎస్టి చెల్లించిన చలాన్‌ను డౌన్‌లోడ్ చేయండి/ప్రింట్ చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments