Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో రూ. 900 కోట్లకు పైగా సాంప్రదాయ పాలసీలపై ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ రుణాల పంపిణీ

ఐవీఆర్
శనివారం, 14 జూన్ 2025 (22:25 IST)
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక సంవత్సరం 2025లో తమ కస్టమర్లకు సాంప్రదాయ పాలసీలపై రుణాలుగా రూ. 900 కోట్లకు పైగా పంపిణీ చేసింది. పాలసీపై రుణం తీసుకోవటం పాలసీ దారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది వినియోగదారులకు తమ దీర్ఘకాలిక పొదుపు ప్రణాళికకు ఎలాంటి  అంతరాయం కలిగించకుండా లిక్విడిటీని అందిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025లో, కంపెనీ 42,700 మందికి పైగా కస్టమర్లకు రుణాలను పంపిణీ చేసింది.
 
"జీవిత బీమా అనేది  దీర్ఘకాలిక ఉత్పత్తి, పాలసీ వ్యవధిలో వినియోగదారులు నగదు పరంగా సవాళ్లను ఎదుర్కోవచ్చు. పాలసీపై రుణం తీసుకునే అవకాశం వారి ఆర్థిక పొదుపు ప్రణాళికను క్రమ పద్దతిలో  ఉంచుతుంది. ముఖ్యంగా, కస్టమర్లు పాలసీ సరెండర్ విలువలో 80% వరకు రుణాన్ని పొందవచ్చు అని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, శ్రీ అమిష్ బ్యాంకర్ అన్నారు. 
 
పాలసీపై రుణం పొందే ప్రక్రియ కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2025లో, 98% కంటే ఎక్కువ రుణాలు 24 గంటల్లోపు పంపిణీ చేయబడ్డాయి. కస్టమర్లు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి కంపెనీ వెబ్‌సైట్ లేదా మా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ పరంగా గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 60% పెరుగుదలతో మా కస్టమర్లు పాలసీపై రుణం ఫీచర్‌ను ఎక్కువగా స్వీకరించడాన్ని మేము చూశాము. ఇది దీర్ఘకాలికంగా ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి , ఉత్పత్తిని కొనుగోలు చేసిన తరువాత ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మా కస్టమర్‌ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
 
ముఖ్యంగా, ఈ నిధులను ప్రీమియం చెల్లింపుల కోసం కూడా ఉపయోగించవచ్చు, ఇది పాలసీ కొనసాగింపు మరియు దాని ప్రయోజనాలను నిర్ధారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments