ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీల మోత.. ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే..?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (16:59 IST)
ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంక్ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. కన్వీనియన్స్ ఫీజు కింద కస్టమర్ల నుంచి రూ.50 తీసుకుంటోంది. అయితే ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే వారికే ఇది వర్తిస్తుంది. 
 
బ్యాంక్ సెలవులు, బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఏటీఎం మెషీన్‌కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తు కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 మీ అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేసుకుంటుంది. ప్రతి లావాదేవీకి ఈ చార్జీలు వర్తిస్తాయి. అంటే మీరు రెండు సార్లు ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే.. రూ.100 చెల్లించుకోవాలి. ఏటీఎం మెషీన్‌లో క్యాష్ డిపాజిట్‌కు సంబంధించి ఒక్కో లావాదేవీకి కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 
 
నవంబర్ 1 నుంచి ఈ కొత్త చార్జీల విధింపు అమలులోకి వచ్చిందని పేర్కొంది. అంతేకాకుండా క్యాష్ యాక్సెప్టర్, రిసైక్లర్ మెషీన్లలో నెలకు రూ.10,000కు పైగా డబ్బులు డిపాజిట్ చేయాలని భావించినా కూడా కన్వీనియన్స్ చార్జీలు పడతాయి. 
 
అయితే ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం ఇక్కడ కొంత మందికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్ సహా బేసిక్ సేవింగ్స్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ కలిగిన వారికి మాత్రం ఈ కన్వీనియన్స్ చార్జీలు వర్తించవు. అంటే వీరికి ఈ చార్జీలు పడవు. ఇంకా స్టూడెంట్ అకౌంట్స్, వికాలంగులకు కూడా ఈ చార్జీలు ఉండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments