ఆన్‌లైన్‌లో మోసాలు, కుంభకోణాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వినియోగదారు అమెజాన్ చైతన్యం కాంపైన్

ఐవీఆర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (20:10 IST)
హోం వ్యవహారాలు, భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, అమేజాన్ ఇండియాలు ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు, కుంభకోణాల పెరుగుతున్న ప్రమాదం నుండి వినియోగదారులను కాపాడటానికి దేశవ్యాప్తంగా రూపొందించిన కార్యక్రమం స్కామ్ స్మార్ట్ ఇండియాను పరస్పర సహకారంతో ప్రారంభిస్తున్నారు. ఈ భాగస్వామ్యం కుంభకోణాల గురించి అవగాహనను అట్టడుగు స్థాయిలకు తీసుకువెళ్లడం, అవగాహన, చైతన్యం, టెక్నాలజీ-సాంకేతికత ఆధారంగా నివారణను కలపడం ద్వారా దానిని అందుబాటులోకి తీసుకురావడం, కార్యాచరణకు వీలు కల్పించడం లక్ష్యం పెట్టుకుంది.
 
కాంపైన్లో భాగంగా, I4C- అమేజాన్లు ఉమ్మడిగా రాబోయే నెలల్లో జాతీయ, ప్రాంతీయ స్థాయిలో కార్యక్రమాల క్రమం నిర్వహిస్తాయి. వీటిలో భాగంగా సంక్లిష్టమైన మోసపూరిత పరిస్థితులను సులభంగా అర్థం చేసుకునే భద్రతా సలహాలుగా మార్చే ఆకర్షణీయమైన సామాజిక మీడియా కంటెంట్, లక్షలాది ఇళ్లకు చేరుకునే భద్రతా సలహాలను చూపించే డిజిటల్ ప్రకటనలు, ప్రతి డెలివరీ వ్యక్తిగత భద్రతను గుర్తు చేసేదిగా మార్చే అమేజాన్ ప్యాకేజీల్లో అవగాహనా పత్రాలు, పండగ సీజన్లో సురక్షితంగా కొనుగోళ్లు చేయడంలో వినియోగదారులకు మార్గదర్శకత్వం వహించే స్కామ్-ఫ్రీ సెప్టెంబర్ ద్వారా వారానికి ఒకసారి బహు భాషాల్లో సలహాలు కార్యక్రమం, మోసం గుర్తింపు, నివారణ కోసం AI- ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి జాతీయ హ్యాకథాన్‌లు ఉంటాయి.
 
శ్రీ నిషాంత్ కుమార్, డైరెక్టర్, I4C, ఇలా అన్నారు, పండగ సీజన్లో కొనుగోళ్లు చేయడం అనేది ప్రతి భారతదేశపు ఇంటిలో ఒక సహజమైన భాగం. వినియోగదారులను ముఖ్యంగా మొదటిసారి ఇంటర్నెట్‌ను వినియోగించే వారు, సీనియర్ సిటిజన్స్ వంటి దాడికి అనుకూలంగా ఉండే సమూహాలను మోసం చేయడానికి ప్రయత్నించే మోసగాళ్ల మోసపూరితమైన కార్యకలాపాలకు కూడా ఇది కీలకమైన సమయం. అమేజాన్‌తో ఈ భాగస్వామ్యం అనేది మోసాలను ఏవిధంగా గుర్తించాలి అంశంపై వినియోగదారులకు చైతన్యం కలిగిస్తుంది, వాటికి బాధితులుగా మారకుండా నివారిస్తుంది. ఆన్లైన్లో మోసాలు నివారించే లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, సురక్షితమైన కొనుగోళ్ల అనుభవానికి వీలు కల్పించడానికి భారతదేశంలో అమేజాన్‌తో కలిసి పని చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
 
రాకేష్ భక్షి, వైస్ ప్రెసిడెంట్- లీగల్, అమేజాన్ ఇండియా, ఇలా అన్నారు, అమేజాన్లో, కస్టమర్ల నమ్మకమే మాకు అత్యంత ప్రాధాన్యత. కస్టమర్లను ఆకర్షించడానికి మోసగాళ్లు తెలిసిన బ్రాండ్ల పేర్లను దుర్వినియోగం చేస్తారు, వాళ్లు కేవలం వ్యాపారాలకు హాని చేయడమే కాకుండా దేశంలోని పూర్తి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల ఆత్మవిశ్వాసానికి హాని చేస్తారు. I4Cతో మా భాగస్వామ్యం ద్వారా, మోసాలను గుర్తించడానికి, నివారించడానికి, నివేదించడానికి షాపర్స్‌కు అవగాహన కలిగించి, సాధికారత కల్పించే ఆచరణీయమైన పరిష్కారాలను రూపకల్పన చేయడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము.
 
ఈ సహకారం సురక్షితమైన డిజిటల్ ఇండియాను రూపొందించడం పట్ల ఒక కీలకమైన చర్యను సూచిస్తుంది, వినియోగదారులను రక్షించడానికి ఒక భాగస్వామ్య నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తోంది. భారతదేశంలో సొగానికి పైగా కేసులు ఆన్లైన్లోనే సంభవిస్తున్నాయి, ఇటీవల మెకాఫీ నివేదికలో చేయబడిన విధంగా, పండగ షాపింగ్ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా ఉండటంతో ఇది కీలకమైన సందర్భంలో వచ్చింది.
 
తమ కస్టమర్లను కాపాడటానికి అమేజాన్ వారి కొనసాగుతున్న ప్రయత్నాలపై ఈ కార్యక్రమం రూపొందించబడింది. వినియోగదారులను సురక్షితమైన ఆన్లైన్ కొనుగోళ్ల పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా సామర్థ్య రూపకల్పన వర్క్ షాప్స్ నిర్వహించడానికి కంపెనీ చురుకుగా వివిధ పరిశ్రమ సంస్థలతో నిమగ్నమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments