Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెక్ ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రోగ్రాంను ప్రారంభించిన అమేజాన్ ఇండియా, లక్షకి పైగా క్రియేటర్లు

Advertiesment
Amazon Influencer Program

ఐవీఆర్

, బుధవారం, 3 సెప్టెంబరు 2025 (17:28 IST)
ఆన్ లైన్ షాపింగ్ వృద్ధిని ఉత్తమంగా వినియోగించడానికి కంటెంట్ క్రియేటర్లను ప్రారంభించడానికి తమ ప్రాధాన్యతలో భాగంగా అమేజాన్ ఇండియా తమ టెక్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం(TIP)ను ప్రకటించింది. ప్రోగ్రాం ద్వారా, అమేజాన్ స్మార్ట్ ఫోన్లు, కెమేరాలు, ఇంకా ఎన్నో అలాంటి ఉత్పత్తుల కోసం కస్టమర్లకు సహాయపడే కంటెంట్‌ను సృష్టించడానికి సాధనాలు, వ్యవస్థలను పొందే సౌలభ్యంతో అన్ని పరిమాణాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లను కేటాయిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన అమేజాన్ బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్‌లో ప్రకటించబడిన ఈ ప్రోగ్రాం క్రియేటర్లు తమ కంటెంట్‌ను డబ్బు రూపంలో పొందడానికి వారికి సహాయపడుతుంది, వారి అనుచరులకు షాపింగ్‌ను సులభతరం చేస్తుంది.
 
కస్టమర్లు ఈరోజు ఉత్పత్తులను కనుగొనడంలో, పరిశోధించడంలో, కొనుగోలు చేయడానికి కేంద్రీయంగా ఉన్నారు, అని నిధి ఠక్కర్, హెడ్ ఆఫ్ క్రియేటర్స్ ప్రోగ్రాం, అమేజాన్ ఇండియా అన్నారు. టెక్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాంతో, కస్టమర్లు మరింత అవగాహనతో కూడిన కొనుగోలు నిర్ణయాలు చేయడంలో సహాయపడుతూనే క్రియేటర్లు విజయం సాధించేలా వారిని సమర్థవంతంగా చేసే మా కలపై రెట్టింపు దృష్టి సారిస్తున్నాం, సమస్యలు లేకుండా షాపింగ్ అనుభవాన్ని నిర్థారిస్తున్నాం.
 
కస్టమర్లు, కంటెంట్ క్రియేటర్ల అవసరాలపై అభివృద్ధి చేయబడిన అమేజాన్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం ఇప్పుడు టెక్నాలజీ, ఫ్యాషన్, జీవనశైలి, పేరెంటింగ్, ఫిట్నెస్, ఇంకా ఎన్నో వాటిలో 1 లక్షకు పైగా క్రియేటర్లను కలిగి ఉంది. ఈ కార్యక్రమం క్రియేటర్లు తమ ప్రేక్షకులతో ప్రామాణికమైన భాగస్వామాన్ని పెంచుకుంటూ, సంపాదకీయ స్వేచ్ఛతో అనుకూలంగా చేయబడిన అనుబంధ కంటెంట్‌ను రూపొందించడం ద్వారా తమ సృజనాత్మక దృష్టిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. క్రియేటర్లు amazon.in పై తమ కంటెంట్‌ను విస్తరించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనక్ట్ అవడం ద్వారా తమ పరిధిని విస్తరించుకోవచ్చు. సమీర రెడ్డి, రాజీవ్ మఖని, అంకూర్ వరికూ వంటి ప్రసిద్ధి చెందిన కంటెంట్ క్రియేటర్లు, సెలబ్రిటీలు, నిపుణులు ప్రోగ్రాంలో భాగంగా ఉన్నారు, amazon.in ద్వారా తమ కమ్యూనిటీతో కలిసి ఆనందిస్తున్నారు.
 
ఉత్పత్తి విడుదలలు, డీల్స్‌ను త్వరగా పొందడానికి, సకాలంలో కంటెంట్‌ను సృష్టించడం ప్రారంభించడానికి అమేజాన్ వారి TIP టెక్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోంది. సంభాషణలను ప్రోత్సహించడానికి ఇది పోటీయుతమైన కమిషన్ వ్యవస్థను, ఆధునిక పద్ధతులపై శిక్షణ, ప్రత్యేకమైన అనుబంధ సాధనాలు, అత్యధికంగా చేరుకోవడానికి వ్యూహాలను అందిస్తోంది. క్రియేటర్లు బ్రాండ్ డీల్స్, మానిటైజేషన్ అవకాశాలను పొందడాన్ని, ఆధునిక వర్క్ షాప్స్, ప్రత్యేకమైన ఘటనలు, తోటి వారితో నెట్ వర్కింగ్, బ్రాండ్స్, అమేజాన్ నాయకులను ఆనందించవచ్చు. సాటిలేని వ్యవస్థలు, అవకాశాలతో క్రియేటర్లకు సాధికారత కల్పించడం ద్వారా, TIP భారతదేశపు టెక్ క్రియేటర్ ఆర్థిక వ్యవస్థ కోసం శక్తివంతమైన మద్దతు వ్యవస్థను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
 
ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ నేర్చుకోవడానికి, పాల్గొనడానికి, అభివృద్ధి చెందడానికి మాధ్యమాన్ని కేటాయించే అమేజాన్ లైవ్, అమేజాన్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం, క్రియేటర్ సెంట్రల్, క్రియేటర్ యూనివర్శిటీ, ఎలివేట్, క్రియేటర్ కనక్ట్ వంటి ప్రోగ్రాంతో భారతదేశంలో క్రియేటర్ నెట్‌వర్క్‌లో పెట్టుబడి పెట్టడాన్ని అమేజాన్ కొనసాగిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Atchannaidu: ఉల్లిరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అచ్చెన్నాయుడు