హైదరాబాదులో తొలి గోల్డ్ ఏటీఎంలు.. ఇక షాపులకు వెళ్లక్కర్లేదు..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (22:32 IST)
డబ్బు డ్రా చేసే ఏటీఎంల గురించి వినివుంటాం. అయితే గోల్డ్ ఏటీఎంల గురించి విన్నారా? అయితే ఈ కథనం చదవండి. గోల్డ్ సిక్కా దేశ వ్యాప్తంగా  3వేల గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  
 
దీంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇక దుకాణాలకు వెళ్లవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ఏటీఎంలలో పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఈ ఏటీఎంల ద్వారా ఉంటుంది. 
 
వచ్చే 45 రోజుల నుండి 50 రోజుల్లో హైదరాబాద్‌లోని పాతబస్తి, సికింద్రాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు గోల్డ్ సిక్కా ప్రకటించింది. అంటే మొదట హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి. 
 
ఈ గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు చేయడానికి చెన్నైకు చెందిన టెక్ సంస్థ ట్రూనిక్స్ డేటావేర్, కేఎల్ హై-టెక్ సెక్యూర్ ప్రింట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గోల్డ్ సిక్కా సీఈవో తరుణ్ అన్నారు.
 
ఈ గోల్డ్ ఏటీఎంల నుండి ఒకేసారి 0.5 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఈ సంస్థ జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించవచ్చు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments